ఫాంహౌస్‌లో కోడి పందెం.. 10మంది అరెస్టు

కీసర, మే 4 : వ్యవసాయక్షేత్రంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న 10మంది ముఠాను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జె.నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. కీసర మండలం రాంపల్లిదాయర గ్రామ శివారులో ఓ ఫాంహౌస్ నిర్వాహకుడు బుచ్చిబాబు గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఫాంహౌస్‌పై దాడిచేసి బుచ్చిరెడ్డి, దమ్మాయిగూడకు చెందిన సుధాకర్, ఘట్కేసర్కు చెందిన వెంకటాద్రి, ఈడబ్ల్యూఎస్కాలనీకి చెందిన కాశయ్య, కుషాయిగూడకు చెందిన దుర్గాప్రసాద్, రాంపల్లిదాయరకు చెందిన రంగరాజు, కాప్రాకు చెందిన హన్మంత్, నాగారానికి బోడుగు యాకుబ్, ఘట్కేసర్కు చెందిన రాఘవ, కరీంగూడకు చెందిన సత్యనారాయణరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుంచి రూ.24,500 నగదు, నాలుగు పందెం కోళ్లు, 10 ద్విచక్ర వాహనాలు, పది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- kodi pandalu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

