నేటి నుంచి కీసర బ్రహ్మోత్సవాలు

- భక్తులకు ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం, ఆలయ నిర్వాహకులు..
కీసర, మార్చి 8 : తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 14వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. భక్తులు స్వామిని దర్శించుకోవడానికి సౌకర్యాలను ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి తెలిపారు.
రోజువారీ బ్రహ్మోత్సవాల వివరాలు..
- 9వ తేదీ ఉదయం 11 గంటలకు…విఘ్నేశ్వరపూజ, పూణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతిష్ఠాపనం, సాయంత్రం 4గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం , రాత్రి 8 గంటలకు స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేసే కార్యక్రమం.
- 10 తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి రుద్రస్వాహాకర హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7 గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం, రాత్రి 8 గంటలకు స్వామి వారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేసే కార్యక్రమం, రాత్రి 9.30గంటలకు ధనష్ట నక్షత్ర యుక్త మకరలగ్నమందు భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామి వార్ల కల్యాణ మహోత్సవం.
- 11వ తేదీ గురువారం ఉదయం 4 గంటల నుంచి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 6 నుంచి సామూహిక అభిషేకాలు, ఉదయం 9 నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 8 గంటల నుంచి నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు భజనలు, రాత్రి 12 గంటల నుంచి రామలింగేశ్వరస్వామి వారికి సంతతధారాభిషేకం.
- 12వ తేదీ శుక్రవారం ఉదయం 5.30గంటల నుంచి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 6 గంటల నుంచి సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటల నుంచి స్వామి వారికి అన్నాభిషేకం, రాత్రి 7 గంటల నుంచి ప్రదోషకాలపూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామి వారికి విమాన రథోత్సవం.
- 13వ తేదీ శనివారం ఉదయం 5.30 గంటల నుంచి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, రాత్రి 7 గంటల నుంచి ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం.
- 14వ తేదీ ఆదివారం ఉదయం 5.30గంటల నుంచి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉదయం 7గంటల నుంచి సామూహిక అభిషేకాలు, ఉదయం 7గంటల నుంచి ప్రదోషకాలపూజ, హారతి, మంత్రిపుష్పం, ఉదయం 8గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం, ఉత్సవ సమాప్తి పండిత సన్మానం కార్యక్రమాలతో కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేద పారాయణం, శివపంచాక్షరి, శ్రీ సూక్త, దుర్గాసూక్త, మన్యుసుక్తాది పారాయణములు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహణాధికారులు తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- keesaragutta temple
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

