ఆత్మీయ పలకరింపు.. అత్యాధునిక వైద్య సేవలు

కరోనా రోగులకు ఊపిరి పోస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ వైద్యశాల
ప్రత్యేక శ్రద్ధతో కరోనా రోగులకు చికిత్స.. సంవత్సర కాలంలో 168 మందికి సేవలు
మల్కాజిగిరి, మే 20: అదో ప్రభుత్వ దవాఖాన. స్వరాష్ట్రంలో అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంది. అక్కడికి వచ్చే రోగులను ఆత్మీయ పలకరింపుతో కావాల్సిన వైద్య సేవలందిస్తున్నది. మరీ ముఖ్యంగా కరోనా రోగుల పాలిట కల్పతరువుగా మారింది. ఒకరా ఇద్దరా సంవత్సర కాలంగా కరోనా బారిన పడిన 168 మందిని పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చింది మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాల.
అత్యాధునిక సేవలు..
మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాల ముఖ్యంగా కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నది. మహమ్మారి బారిన పడిన వారి కోసం ఈ వైద్యశాలలో అధికారులు ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పదిహేను రోజుల పాటు అన్ని రకాల సేవలు అందించి పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చి ఇంటికి పంపుతున్నారు. సంవత్సర కాలంలో 168 మందికి నయం చేసి ఇంటికి పంపారు.
24 వేల మందికి కరోనా పరీక్షలు..
ఈ ప్రభుత్వ వైద్యశాలలో ఇప్పటి వరకు 24 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారందరికి వైద్యాధికారులు కిట్లు పంపిణీ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని హోం ఐసొలేషన్ చేశారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని ఐసొలేషన్ సెంటర్‌కు తరలించారు. అంతేకాక 14 వేల మందికి కొవిడ్ టీకాలు సైతం వేశారు.
త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు..
త్వరలో జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంటు పరికరాలు చేరుకున్నారు. మొత్తం రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటు పనులు మరో వారం రోజుల్లో పూర్తి కానున్నాయి.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Covid Hospital
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

