అయోమయం..భయం భయం

మల్కాజిగిరి, ఏప్రిల్ 22: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మల్కాజిగిరి జోన్ పరిధిలో ప్రజలు భయాందోళనలతో బతుకును వెళ్లదీస్తున్నారు. వైద్యులు, అధికారుల సూచనలు పాటిస్తున్నా గాని ఎవరికి కరోనా వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పత్రికల్లో, ప్రచారమాధ్యమాల్లో వస్తున్న కరోనా వార్తలతో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడిన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరికొందరు కరోనాతో దవాఖానలో చేరాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు. టీకాలు వేసుకున్న వారికి కూడా లక్షణాలు కనిపిస్తుండడంతో ఆందోళన రెట్టింపు అవుతుంది. లక్షలు వెచ్చించినా దవాఖాన నుంచి ఇంటికి క్షేమంగా వస్తామా.. రామా..? అనే సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరొకొందరు దేవుడిపైనే భారం వేసి మమ్ములను మీరే రక్షించాలని రోజూ దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.
కరోనా బారిన పడకుండా..
- కరోనా నుంచి తమని తాము కాపాడుకునేందుకు ప్రజలు వారికి తెలిసిన జాగ్రత్తలతో పాటు వైద్యుల సూచనలను పాటిస్తున్నారు.
- ముఖ్యంగా నిత్యం మూడు పర్యాయాలు ఆవిరి పట్టుకుంటున్నారు.
- ప్రాణాయామం చేస్తున్నారు. సీ విటామిన్ టాబ్లెట్లు వాడుతున్నారు.
- ఇంటి గుమ్మానికి వేప కొమ్మలు తగిలించుకుంటున్నారు. కషాయంగా తీసుకుంటున్నారు.
- రాత్రి పడుకునే ముందు వేడి పాలలో పసుపు, వెల్లిపాయ, అల్లం, మిరాయాలు కలుపుకుని తాగుతున్నారు.
- ఇక ప్రతి గంటకోసారి బయటకు వెల్లి వచ్చినా.. పక్క వారింటికి పోయి వచ్చినా.. ఇతరులతో కలిసినా శానిటైజరును రాసుకుంటున్నారు.
- అయి నా గాని ప్రజల్లో మాత్రం తెలియని ఆందోళనలో ఉంటున్నారు.
ఆహారపు అలవాట్లలోనూ మార్పులు..
- ఆహారపు అలవాట్లలోనూ కరోనా నుంచి కాపాడుకునేందుకు జనాలు ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు.
- బయట తిండ్లు తగ్గించుకున్నారు.
- ఇంట్లోనే వారికి కావాల్సిన రుచులను చేసుకుంటున్నారు.
- వంటలకు వాడే నూనెను సైతం బ్రాండ్లు మార్చి వాడుతున్నారు.
- కొన్ని కుటుంబాలైతే ఆయిల్ పాకెట్లకు బదులు గానుగ నూనె కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
శాస్ర్తాలు, పురాణాలను సైతం..
- పెరిగిపోతున్న కొవిడ్ కేసులతో ఆధునిక వైద్యంతో పాటు కొందరు శాస్ర్తాలు, పురాణాలు నమ్ముతున్నారు.
- పండితుల సూచనలు పాటిస్తున్నారు.
- మరి కొందరు శ్లోకాలు, మంత్రాలు పటిస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- carona virus
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

