కరోనాను జయించి.. క్షేమంగా ఇండ్లకు..

- రాష్ట్రీయ విద్యాకేంద్రం ఐసొలేషన్ కేంద్రం నుంచి 22 మంది డిశ్చార్జి
- హర్షం వ్యక్తం చేసిన బాధితులు, కుటుంబసభ్యులు
ఘట్కేసర్, మే 21: పోచారం మున్సిపాలిటీలోని రాష్ట్రీయ విద్యాకేంద్రం కొవిడ్ ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొంది ఆరోగ్యంగా శుక్రవారం బాధితులు ఇండ్లకు చేరుకున్నారు. దాదాపు 22 రోజుల పాటు కొవిడ్ చికిత్స అందించిన కేంద్రం నిర్వాహకులు 21 మందిని క్షేమంగా ఇండ్లకు పంపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉండే కొవిడ్ బాధితులకు సెంటర్ నిర్వాహకులు ప్రతిరోజూ పౌష్టికాహారంతో పాటు బలాన్ని ఇచ్చే ఫుడ్‌ను అందజేశారు. నిపుణులైన డాక్టర్లు ప్రతి రోజూ పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు, సలహాలు, సూచనలు అందజేశారు. దీంతో త్వరగా కొలుకున్న వారు క్షేమంగా ఇండ్లకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ సెంటర్ నిర్వాహకుడు రాష్ట్రీయ విద్యా కేంద్రం, సేవా భారతి ప్రతినిధి మహేశ్ మాట్లాడుతూ.. కొవిడ్ సెంటర్లో 260 బెడ్లు, 10ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

