కోడ్ కూసింది.. రాత చెదిరింది
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు పెద్దేముల్ మండలంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.
- విడుదలైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
- కలెక్టర్ ఆదేశాలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పెయింటింగ్‌లు, పోస్టర్ల తొలగింపు
- నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తాం : తహసీల్దార్
పెద్దేముల్, ఫిబ్రవరి 11 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు పెద్దేముల్ మండలంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దేముల్ తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి సూచనలతో మండల పరిధిలోని మారేపల్లి, తట్టేపల్లి, కందనెల్లి, మంబాపూర్, మన్సాన్పల్లిలో వీఆర్ఏలు శనివారం రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించారు.
అక్కడక్కడ గోడలపై ఉన్న వాల్ పెయింటింగ్‌ను చెరిపి వేయించారు. అలాగే కార్యాలయాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల ఫొటోలను తొలగించి స్టోర్ రూమ్‌ల్లో భద్రపరిచారు. మండల పరిధిలోని వీఆర్ఏలు సున్నంతో వాల్ పెయింటింగ్‌లను, పోస్టర్లను పూర్తిగా కనిపించకుండా పెయింటింగ్ వేయించారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, వివిధ పార్టీల జెండాలను పూర్తిగా తొలగించారు. మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామని తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ప్రైవేట్ వాహనాలపై ఫొటోలు, చిన్న చిన్న పోస్టర్లు ఎవరూ పెట్టుకోరాదని ఆయన సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

