ఉపాధిపై ఉదాసీనత
గ్రామీణ నిరుపేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో అధికారుల ఉదాసీనతతో కూలీలు ఇబ్బంది పడు తున్నారు. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీరు, నీడ వసతి లేక అరిగోస పడుతున్నారు.
- పనిచేసే ప్రాంతాల్లో వసతుల కరువు
- అస్వస్థతకు గురైనా.. వడదెబ్బ తగిలినా అందుబాటులో లేని మెడికల్ కిట్లు
- చౌడాపూర్ మండలంలోని అగ్రహారానికి చెందిన చంద్రయ్య అస్వస్థతతో మృతి
- యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన సత్తయ్యకు గాయాలు
కులకచర్ల/ యాచారం, మే 30 : గ్రామీణ నిరుపేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో అధికారుల ఉదాసీనతతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీరు, నీడ వసతి లేక అరిగోస పడుతున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. వాటిని సక్రమంగా ఖర్చు చేసి కార్యక్రమం సజావుగా సాగేలా చూ డాల్సిన బాధ్యత మాత్రం సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులపైనే ఉం టుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీ లు సేద తీరేందుకు టెంట్లు లేకపోవడంతో నిలువ నీడ లేక చెట్ల కిందికి వెళ్తున్నారు. కూలీ గాయపడినా.. వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోతే నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లూ అసలే అందుబాటుల్లేవు.
గురువారం వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండలంలోని బంగ్రంపల్లి అనుబంధ గ్రామమైన అగ్రహారంలో రోజూ మాదిరిగానే ఉపా ధి హామీ పనికి వెళ్లిన బిచ్చపు చంద్రయ్య (58) అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీలో నొప్పి అంటూ కొద్ది దూరం వెళ్లి కుప్పకూలి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందగా…. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పంబలి సత్తయ్య అనే వ్యక్తి రోజూ మాదిరిగానే ఉపాధి హామీ పనులకెళ్లాడు. అక్కడ పెద్ద రాయిని తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు అతడి కాలుపై ఆ రాయి పడడంతో తీవ్ర గాయమైంది. కాలు వేలు చితికిపోయింది. పని చేసే ప్రదేశంలో మెడికల్ కిట్ అందుబాటులో లేకపోవడంతో అతడికి చికిత్స ఆలస్యమై అధిక రక్తస్రావమైందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య పేర్కొన్నాడు. కూలీలు పని చేసే ప్రాంతంలో తప్పనిసరిగా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని.. సత్తయ్యకు దవాఖాన ఖర్చులతోపాటు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

