సభా సంరంభం
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.
- దద్దరిల్లేలా బీఆర్ఎస్ సభ
- ఖమ్మం శివారులో వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రాంగణం
- సభను వీక్షించేందుకు 50 ఎల్ఈడీ స్క్రీన్స్
- కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు
- పనులను పర్యవేక్షిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్
- సభకు హాజరు కానున్న నలుగురు సీఎంలు, మాజీ సీఎం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర, జాతీయ నేతలు
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది. ఖమ్మం జిల్లాకేంద్రం సమీపంలోని వీ వెంకటాయపాలెంలో ఈ నెల 18న కనీవినీ ఎరుగని రీతిలో సభ జరుగనున్నది. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్‌మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుకానున్నారు. వంద ఎకరాల సువిశాల స్థలం.. 15 వేల మంది వీఐపీలు కూర్చునేందుకు గ్యాలరీలు.. ప్రజలు సభను వీక్షించేందుకు 50 ఎల్ఈడీ తెరలు.. వాహనాల పార్కింగ్‌కు 400 ఎకరాలు.. వెయ్యి మందికి పైగా వలంటీర్లు.. 70 అడుగులకుపైగా అతిథుల కటౌట్లు.. సుమారు 4 లక్షల మందికి పైగా జనం హాజరయ్యే అవకాశం.. మొత్తానికి సభ దేశ ప్రజలు ఔరా.. ! అనేలా కొనసాగనున్నది. ఏర్పాట్లను సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. సభ బందోబస్తును ఏడుగురు ఐపీఎస్‌లు పర్యవేక్షించనున్నారు.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటున్నది. సభ సందర్భంగా నగరం గులాబీమయమైంది. గులాబీ జెండాల రెపరెపలు.. స్వాగత తోరణాలతో కళకళలాడుతున్నది..
– నమస్తే నెట్వర్క్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

