కల్వకుర్తిలో కసిరెడ్డి కయ్యం..!
కల్వకుర్తి కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి చుక్కలు చూపిస్తున్నారు. రాత్రికి రాత్రే పార్టీ కండువా కప్పుకున్న వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ రోజుకొక మండల పార్టీ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి హెచ్చరికలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా పలు మండలాల్లో కీలక నేతలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
- తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు
- అధిష్ఠానానికి చుక్కలు చూపుతున్న కాంగ్రెస్ నేతలు
- కల్వకుర్తిలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న సుంకిరెడ్డి-వంశీచంద్ వర్గాలు
- కసిరెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరిక
కల్వకుర్తి కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి చుక్కలు చూపిస్తున్నారు. రాత్రికి రాత్రే పార్టీ కండువా కప్పుకున్న వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ రోజుకొక మండల పార్టీ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి హెచ్చరికలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా పలు మండలాల్లో కీలక నేతలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇటీవల తలకొండపల్లిలో సుంకిరెడ్డి ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు నేతలు కసిరెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో వంశీచంద్‌రెడ్డి కూడా కడ్తాల్‌లో సమావేశం నిర్వహించారు. కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నా.. టికెట్ ఖరారుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)/ఆమనగల్లు
కల్వకుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్యారాచూట్ నేత రాకతో పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాత్రికి రాత్రే కం డువా కప్పుకున్న వారి కోసం ఇంతకాలం కష్టపడ్డ వారిని బలి చేస్తారా? అంటూ కీలక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గతేడాది, ఏడాదిన్నరగా సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండి, పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ కూడా ఆయనకే వస్తుందని, నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలందరూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో కుంపటి రాజుకున్నది. ఈ పరిణామంతో గత కొన్నిరోజులుగా నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు. ఆమనగల్లు, కల్వకుర్తి, మాడ్గుల, కడ్తాల్ మండలాల పరిధిల్లోని నేతలు, కార్యకర్తలు నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకొని, కసిరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు.
టికెట్ విషయం లేవనెత్తకుండా..
ఇటీవల వంశీచంద్‌రెడ్డి ఆమనగల్లు సమీపంలోని డీఎంకే ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డిని పరిచయం చేసేందుకు ఏర్పా టు చేసిన ఈ సమావేశానికి తాము హాజరు కావడంలేదని సుంకిరెడ్డి ప్రకటించడంతో కీలక నేతలెవరూ అక్కడికి వెళ్లలేదు. ముఖ్యంగా కొన్నిరోజులుగా సుంకిరెడ్డికి అనుకూలంగా సమావేశాలు నిర్వహించిన మండల పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వంశీచంద్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో కనిపించకపోవడం గమనార్హం. దీంతో వచ్చిన వారికి మాత్రమే కసిరెడ్డిని పరిచయం చేసిన వంశీచంద్‌రెడ్డి టికెట్ ఎవరికి వస్తుందనే అంశంపై మాత్రం పెదవి విప్పలేదు. ఒకవేళ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తితే సమావేశానికి హాజరైన వారిలోనూ కొంతమంది వ్యతిరేకించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకవైపు కీలక నేతలు, కార్యకర్తలు సమావేశానికి రాకపోవడం, వచ్చిన వారిలోనూ కసిరెడ్డికి టికెట్ అని లేవనెత్తితే నిరసన గళం వినిపించే అవకాశమున్నందున ముందు జాగ్రత్తగా ఆ అంశాన్ని లేవనెత్తలేదని తెలుస్తున్నది.
కసిరెడ్డికి ఇస్తే వ్యతిరేకంగా పని చేస్తాం
వంశీచంద్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని మండలాల నుంచి కొందరు నేతలు రాగా.. ఇదే సమయంలో తలకొండపల్లిలో మండల పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్పష్టమైన ప్రకటన చేశాయి. ప్యారాచూట్ నేతకు టికెట్ ఇచ్చేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకా లం పార్టీకి పనిచేసిన వారికి ఎలా న్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కొని.. పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ తమ మనోభావాలను దెబ్బతీసేలా కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైందని పార్టీ నేతలే చెబుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

