అంగన్వాడీ సెంటర్లలో ఫుడ్ కమిషన్ తనిఖీలు

పెద్దఅంబర్‌పేట : ప్రభుత్వం నుంచి అందుతున్న నిత్యావసర సరుకులు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అంగన్వాడీ సెంటర్లు, చౌకధార దుకాణాలను ఫుడ్ కమిషన్ సభ్యులు సందర్శించారు. కేంద్రాల్లో నిత్యావసర సరుకుల పట్టికను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల బాక్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపాల్టీలోని కుంట్లూర్‌లోని ప్రభుత్వ చౌకధార దుకాణాలను, తట్టిఅన్నారంలోని అంగన్వాడీ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. నెల వారిగా అందుతున్న సరుకుల వివరాలను బోర్డులో ఉంచాలని, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సెంటర్లను తనిఖీ చేయాలని సూచించారు.
బాలింతలకు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి అందుతున్న పొషక ఆహార పదార్ధాలను విధిగా అందించాలని, అంగన్వాడీ స్కూల్లోని గర్భిణి మహిళలను ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని ఆశ వర్కర్లకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ హైదర్ ఆలీ, సీపీడీవో వినిత పాల్గొన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

