మంచిరోజులు పోయె.. మందుల్లేని రోజులొచ్చె
ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. వసతుల లేమి, డాక్టర్లు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సరిపడా మందులు సైతం లభించడం లేదు.
- సీజనల్ వ్యాధులతో దవాఖానల్లో పెరిగిన ఓపీ
- రద్దీకి తగ్గట్టుగా మందులు లేక అవస్థలు పడుతున్న రోగులు
- ఇండెంట్ పెట్టినా..అరకొరగానే కేటాయింపులు
- విధిలేక ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్న ప్రజానీకం
ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. వసతుల లేమి, డాక్టర్లు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సరిపడా మందులు సైతం లభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు దవాఖానలకు దీటుగా వైద్యం లభించి, ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోగా..ప్రస్తుతం పరిస్థితి తలకిందులైందని ప్రజలు వాపోతున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతుండడం..అందుకు తగ్గట్టుగా మందులు లేకపోవడంతో నిరుపేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు.
– రంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 25 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 70 బస్తీ దవాఖానలు, 122 పల్లె దవాఖానల ద్వారా వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే సర్కారు దవాఖానల్లో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతున్నది. వైద్య సేవలు ఉచితంగానే అందుతున్నా.. కొన్ని రకాల మందులను మాత్రం ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఇటు వికారాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖానల్లోనూ మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నెలరోజులుగా తాండూరులోని జిల్లా ఆసుపత్రితోపాటు మాతాశిశు సంరక్షణ, ఇతర ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత ఉండడంతో రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెడుతున్నప్పటికీ ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో కొరత ఏర్పడుతున్నది. మందుల కొరత విషయమై సంబంధిత అధికారిని వివరణ కోరగా.. రెండు రోజుల క్రితమే మందులు వచ్చాయంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చాలామంది వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. అక్కడక్కడా డెంగీ వంటి కేసులు సైతం నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలతో ప్రజానీకం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డాక్టర్లు పరీక్షించి ఐదారు రకాల మందులు రాస్తే.. అందులో ఒకటి, రెండు రకాలకు మించి దొరకడం లేదు. కొన్ని ఆసపత్రులలో స్లైన్ ఎక్కించేందుకు ఉపయోగించే ఐవీ సెట్లు సైతం లేవు. ఇంకొన్ని ఆసుపత్రులలో చిన్న పిల్లలకు సంబంధించిన దగ్గు సిరప్, కంట్లో వేసుకునే చుక్కల మందులు సైతం అందుబాటులో లేవు. ఉమ్మడి జిల్లాలోని చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులది దాదాపు ఇదే పరిస్థితి.
ఇండెంట్ పెట్టినా.. అరకొరగానే సరఫరా..
ఆసుపత్రులలో నిత్యం నమోదవుతున్న ఓపీని పరిగణనలోకి తీసుకుని సరిపడా మందుల కోసం నెలనెలా ఇండెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఆసుపత్రికి కేటాయించిన బడ్జెట్కు అనుగుణంగా కొన్ని మందులు, అత్యవసర పద్ధతిలో మరికొన్ని మందులను ఆసుపత్రి వర్గాలు సమకూర్చుకోవాలి. అయితే గత కొద్దిరోజులుగా ఆసుపత్రులకు సరిపడా మందులు సరఫరా కావడం లేదు. ఫార్మాసిస్టులు ఇండెంట్ పెట్టినప్పటికీ కొంతమేరకే మందులను అందజేస్తున్నారు.
దీనివల్ల ఆసుపత్రుల్లో రోగులకు మందులను సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. ఒకటి, రెండు రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారు. కొన్ని దవాఖానల్లో పరిస్థితి మరోలా ఉన్నది. కొంతమంది డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఆసుపత్రులపై పర్యవేక్షణ లేకుండా పోయింది. దీనివల్ల ఆసుపత్రులలో నమోదవుతున్న ఓపీని సైతం వారు తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల ఎంతమేర మందులు అవసరం పడుతాయో! ముందుగానే అంచనా వేసుకోక ఫార్మాసిస్టుల ద్వారా ఇండెంట్ సైతం పెట్టడం లేదు.
ఫలితంగా ఆయా ఆసుపత్రులు ప్రస్తుత పరిస్థితుల్లో మందుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఏటా ఈ సీజన్లో వ్యాధులు ప్రబలుతాయని డాక్టర్లకు తెలిసినప్పటికీ ముందస్తుగా స్టాక్ పెట్టుకోకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోగులకు అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉండేలా చూడాలని రోగులు కోరుతున్నారు.
బయట తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో నా బిడ్డకు డెలివరీ అయ్యింది. డాక్టరు మందులు రాసి ఇచ్చిండ్రు. కొన్ని మందులు ఇక్కడనే ఇచ్చిండ్రు. ఇంకొన్ని బయట తీసుకోమన్నరు. డబ్బులు లేకనే గవర్నమెంటు ఆసుపత్రికి వచ్చినం. మందులు బయట తీసుకోమంటే ఎట్లా. మా దగ్గర డబ్బులు ఎక్కడివి. మా దగ్గరే డబ్బులు ఉంటే ప్రైవేటుకు పోయటోళ్లం కదా. మాలాంటి పేదల కోసం రోగులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచాలి.
-కవ్ల్య నర్సింహులు, బీరెల్లి గ్రామం, కోట్పల్లి మండలం,, వికారాబాద్ జిల్లా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

