Illegal Mining | ప్రైవేట్ రిసార్ట్ కోసం యథేచ్చగా.. ప్రభుత్వ భూమి నుంచి మట్టి అక్రమ రవాణా
Illegal Mining | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ రెవెన్యూలో అర్థ్ రిసార్ట్ ఏర్పాటు చేశారు. అయితే రిసార్ట్ కు పార్కింగ్ స్థలము లేకపోవడంతో పక్కనే ఓ రైతు పొలమును పార్కింగ్ స్థలం కోసము లీజుకు తీసుకున్నారు.
Illegal Mining| మొయినాబాద్, జూన్ 27 : ప్రభుత్వ భూమిలో ఏం చేయాలన్నా అధికారుల అనుమతి తప్పనిసరి అని తెలిసిందే. అయితే వీళ్లకు మాత్రం అవేం పట్టింపులేదు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఓ ప్రైవేట్ రిసార్ట్ కోసం ప్రభుత్వ భూమిలో నుంచి యథేచ్చగా ట్రాక్టర్ల కొద్దీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
ప్రభుత్వం భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ఓ ప్రైవేట్ రిసార్ట్ పార్కింగ్ స్థలంలో పోస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ రెవెన్యూలో అర్థ్ రిసార్ట్ ఏర్పాటు చేశారు. అయితే రిసార్ట్ కు పార్కింగ్ స్థలము లేకపోవడంతో పక్కనే ఓ రైతు పొలమును పార్కింగ్ స్థలం కోసము లీజుకు తీసుకున్నారు. అయితే ఆ భూమిలో నల్ల మట్టి ఉండడంతో పార్కింగ్ స్థలానికి పనికొచ్చే విధంగా అందులో మొరం పోస్తున్నారు. అందులో వేస్తున్న మొరం కనకమామిడి రెవెన్యూలోని 510 సర్వే నెంబర్ లో నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి రిసార్ట్ పార్కింగ్ స్థలానికి తరలిస్తున్నారు.
మూడు జేసీబీలు సుమారుగా 10 ట్రాక్టర్లను పెట్టి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.


Read Also :
US Ambassador: వచ్చే ఏడాది ఇండియా పర్యటనకు ట్రంప్
Bengaluru: తలపై పడిన చెట్టు కొమ్మ.. కోమాలోకి వెళ్లిన బెంగుళూరు బైకర్.. వీడియో
Venkatesh | వెంకీమామకు ఇంత డిమాండ్ ఏంటి?.. వరుసగా క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు!
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

