Ibrahimpatnam : ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దు..

- పేదింటి ఆడబిడ్డలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి..
- 136మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత
ఇబ్రహీంపట్నం : ఆడబిడ్డల పెండ్లిలు చేసేందుకు తల్లిదండ్రులు ఆర్భాటాలకు పోయి అప్పులపాలు కావద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి వారి పెండ్లిలకు పెద్దన్నలా అండగా నిలుస్తున్నారన్నారు. కాని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిలు చేసేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆర్భాటంగా చేసి అప్పుల పాలవుతున్నారన్నారు.
ఇలాంటి పెళ్లిలు పూర్తిగా మరిచిపోయి అతి తక్కువ మందితో చేసుకుంటే ఎలాంటి ఆర్థిక సమస్యలుండవని తెలిపారు. ప్రభుత్వం ఇంతచక్కటి పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రతిపక్షపార్టీల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రజలు దీవించి గెలిపించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పడు ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తుందని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

