నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి వణికిస్తున్నది. రాజేంద్రనగర్‌లోని జూపార్క్‌లో వన్యప్రాణులను చలి నుంచి సంరక్షించేందుకు సిబ్బంది రక్షణ
చర్యలు చేపడుతున్నారు. ఎన్క్లోజర్లకు గోనె సంచులు కట్టారు. వన్యప్రాణులు ఉండే ఎన్క్లోజర్లలో ఉష్ణోగ్రతలు పెంచేందుకు రూమ్ హీటర్లు, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. గదిలో వెచ్చగా ఉండడంతో వన్యప్రాణులు అక్కడే సేదతీరుతున్నాయి.
– సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)
జూ బయోలజిస్ట్ల వర్క్‌షాప్ ప్రారంభం
శాలిబండ, నవంబర్ 23 : జూ బయోలజిస్ట్లు వన్యప్రాణుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ ప్రశంసించారు. కేంద్ర జూ అథారిటీ, నెహ్రూ జూ పార్క్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జూ బయోలజిస్ట్ల వర్క్‌షాప్‌ను బుధవారం రాజశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూను సందర్శించే పర్యాటకులు ఎన్క్లోజర్లలో నిరాడంబరంగా సంచరించే జంతుజాలాన్ని విక్షిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే దాని వెనక బయోలసిస్ట్ల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వర్క్‌షాప్ కొనసాతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జూ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ ఏ.నాగమణి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ హకీం, వెటర్నరీ సలహాదారు గౌరి మల్లాపూర్ పాల్గొన్నారు.