HMDA | చేజారుతున్న ప్రాజెక్టులు.. నిధుల్లేక చేతులు ఎత్తేస్తున్న హెచ్ఎండీఏ
ఒకప్పుడు చేతి నిండా ప్రాజెక్టులు.. గల్లా పెట్టె నిండేలా రెవెన్యూ మార్గాలు. ఇంకేముంది కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించడమే ఆలస్యం.. చకచకా ప్రాజెక్టులను పట్టాలెక్కించిన హెచ్ఎండీఏ..
- హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించినా.. నిర్మాణ బాధ్యతలు ఇతర విభాగాలకు..
HMDA | సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చేతి నిండా ప్రాజెక్టులు.. గల్లా పెట్టె నిండేలా రెవెన్యూ మార్గాలు. ఇంకేముంది కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించడమే ఆలస్యం.. చకచకా ప్రాజెక్టులను పట్టాలెక్కించిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు నిధుల్లేక చేతులు ఎత్తివేయాల్సి వస్తున్నది. ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినా.. నిధుల్లేక ఇతర సంస్థలకు మళ్లించాల్సి వస్తున్నది.
గ్లోబల్ సిటీ ప్రతిష్టను పెంచే ఎన్నో ప్రాజెక్టులు హెచ్ఎండీఏ చేతుల నుంచి జారిపోతున్నాయి. దీనికి హెచ్ఎండీఏకు నెలవారీగా వచ్చే ఆదాయం లేకపోవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో హెచ్ఎండీఏ కీలకపాత్ర పోషిస్తున్నది. 11 జిల్లాల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, మెరుగైన రవాణా సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్‌ల నిర్మాణంలో ముఖ్య భూమికను పోషించే హెచ్ఎండీఏ.. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేజార్చుకుంటున్నది.
గతంలో మెరుగైన గృహ సముదాయాలను జనాలకు అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ తరహా లే అవుట్లను అధునాతన పట్టణ ప్రణాళికలతో డెవలప్ చేసింది. అనంతరం నగరంలో ఫైఓవర్లు, ట్రక్ పార్కులు, లాజిస్టిక్ హబ్, ఐటీ కారిడార్లు, ఎకో పార్కులు, అర్బన్ ఫారెస్ట్రీలను అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ.. నిధుల్లేక చేతులేత్తేస్తున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడం ఓ వైపు ఉంటే.. రెవెన్యూ మార్గాలు తగ్గిపోవడం ఇప్పుడు ఆ విభాగాన్ని ఖాళీ చేతులతో కూర్చునేలా చేస్తున్నది.
ప్రాజెక్టు చేపట్టాల్సిన సమయానికి..
అవుటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా హెచ్ఎండీఏ గ్రీన్ ఫీల్డ్ హైవేను ఫ్యూచర్ సిటీ మీదుగా హెచ్ఎండీఏ-హెచ్‌జీసీఎల్ డిజైన్ చేసింది. అయితే ఈ ప్రాజెక్టు భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టు చేపట్టాల్సిన సమయానికి హెచ్ఎండీఏ చేతుల్లోనుంచి జారిపోయింది. అదేవిధంగా నగరంలో లింకు రోడ్లను నిర్మాణంతో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా నగర శివారుల్లో 49 లింకు రోడ్ల ప్రణాళికలను రూపొందించింది.
ఈ ప్రాజెక్టును హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నిధులిచ్చిన ప్రభుత్వం.. ఆ సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నది. అదేవిధంగా మీరాలం లేక్‌ను సుందరీకరించాలనే లక్ష్యంతో గతంలోనే హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇదేవిధంగా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ పరిసరాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు హెచ్ఎండీఏ సిద్ధం కాగా.. ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ పనులను కూడా ఇతర సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Global City
- hmda
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

