పెద్దఅంబర్‌పేట, ఏప్రిల్ 7: ‘అయ్యో అవ్వా.. నడవనీకె చాతనైతలేనట్టుంది.. ఊర్లదాక దించు తపా’ అంటూ దుండగుడు ఓ వృద్ధురాలికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. బండరావిరాల గ్రామానికి చెందిన ముల్లి బాల మ్మ సద్దుపల్లి చౌరస్తా నుంచి ఊరికి వెళ్తున్నది.
ఇదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై ఆమె వద్దకు వచ్చాడు. ఊరిలో దించుతానని చెప్పి బాలమ్మను బండిపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలోకి వెళ్లాక బండి నిలిపి.. బాలమ్మ మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా తెంచుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.