23 సామూహిక వ్యక్తిగత పోటిలు
23న జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సామూహిక, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు శుక్రవానం ఒక ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్, డిసెంబర్ 15 : 23న జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సామూహిక, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు శుక్రవానం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయికి పంపించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన అంబేద్కర్ భవన్ వికారాబాద్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పోటీలు ప్రారంభం కానుండగా, ప్రతిభ చూపిన యువజన కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
యువజనోత్సవాల్లో పాల్గొనే కళాకారులు 15 నుంచి 29 ఏళ్ల వయసులోపు ఉండాలని, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన కళాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన కళాకారులను జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ప్రదర్శనలు, జానపద నృత్యం (ఫోక్ డ్యాన్స్ ఒక్కో బృందంలో 10 మంది మాత్రమే ఉండాలని, ప్రదర్శనలో జానపద నృత్యాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలన్నారు. ప్రదర్శనకు 15 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారని, జానపద నృత్యం (ఫోక్ డ్యాన్స్ సోలో) ఒక్కో బృందంలో ఐదుగురు మాత్రమే ఉండాలని సూచించారు.
నృత్య ప్రదర్శన సమయం 7 నిమిషాలు మాత్రమే నిని, జానపద గేయాలు(ఫోక్ సాంగ్ గ్రూప్) ఒక్కో బృందంలో అందరు కలిపి 10 మంది వరకు మాత్రమే ఉండాలని తెలిపారు. సినిమా పాటలను అనుమతించరని, ప్రదర్శన సమయం 7 నిమిషాలు మాత్రమే నని, జానపద గేయాలు (ఫోక్ సాంగ్ సోలో) ఒక్కో బృందంలో ఐదుగురు మాత్రమే ఉండాలన్నారు. గ్రూప్ విభాగాల్లో మొత్తం యువకులు, యువతులు లేదా యువతీ యువకులు ఉండవచ్చునని, వాయిద్య పరికరాలు వారే తెచ్చుకోవాలని, లైవ్ ప్రదర్శన చేసిన వారికి ప్రాధాన్యమిస్తారన్నారు. వ్యక్తిగత ప్రదర్శనలు? వ్యాసరచన పోటీలు(స్టోరీ రైటింగ్) ఎంపిక చేసిన అంశంపై ఆంగ్లంలో 60 నిమిషాల్లో రాయాల్సి ఉంటుందన్నారు. ఒకసారి ఎంపిక చేసిన అంశం మార్చేందుకు వీలులేదు? పోస్టర్ మేకింగ్ (పెయింటింగ్) చేసేందుకు 90 నిమిషాల సమయం ఇస్తారని తెలిపారు.
పెయింటింగ్ సామగ్రి తెచ్చుకోవాలని, వకృత్వ పోటీలు, అభ్యర్థులు లాటరీ ద్వారా ఎంపిక చేసిన అంశంపై ఆంగ్లంలో 3 నిమిషాల్లో మాట్లాడాలని తెలిపారు. ఫొటోగ్రపీలో పాల్గొనేవారు రెండు ఫొటోగ్రాఫ్స్ మొబైల్, కెమెరాతో పాటు ప్రింట్లు తీసుకురావాలన్నారు. ఫొటో 1 ఎంబీకి తక్కువ కాకుండా 2 ఎంబీకి ఎక్కువ కాకుండా చూడాలని తెలిపారు. ప్రగతి శీల్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్, యోగా, క్రీడలు, శారీరక శ్రమ, ప్రకృతి దృశ్యం వంటి అంశాలలో ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. యువక్రితి యువతీయువకులకు దేశంలోని వివిధ ప్రాంతాల హస్తకళలను అర్థం చేసుకునేందుకు అభినందించేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తారన్నారు. హస్తకళలు, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల కేటగిరీలో గరిష్ఠంగా ఇద్దరిని ఎంపిక చేస్తారని తెలిపారు. యువజనోత్సవాల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ నెల 19వ తేదీలోగా వివరాలు అందజేయాలన్నారు. స్వయంగా కూడా అందజేయవచ్చునని, ఇతర వివరాలకు 9676638201 ను సంప్రదించాలని వివరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

