బల్దియా.. కొండంత ఆసరా
దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయ పరికరాలు, కృత్రిమ అవయవాలను త్వరలో జీహెచ్ఎంసీ ఉచితంగా పంపిణీ చేయనున్నది.
- దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయ పరికరాలు,
- వచ్చే వారం నుంచి ఉచితంగా పంపిణీ
- ఈ ఏడాది 4456 మంది లబ్ధిదారులకు రూ.3.15కోట్ల విలువైన 7576 పరికరాలు
- సర్కిళ్ల వారీగా ప్రత్యేక క్యాంపులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయ పరికరాలు, కృత్రిమ అవయవాలను త్వరలో జీహెచ్ఎంసీ ఉచితంగా పంపిణీ చేయనున్నది. బల్దియా పరిధిలో నివసిస్తున్న సీనియర్ సిటీజన్లు, దివ్యాంగులు, బీపీఎల్ ఫ్యామిలీకి చెందిన వారికి గతేడాది సర్కిల్‌కు ఒక క్యాంపు ఏర్పాటు చేసి ఎవరికి ఏ పరికరం, కృత్రిమ అవయవాలు అవసరమో గుర్తించి.. అందజేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించగా..వచ్చే వారంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత సర్కిల్ వారీగా గుర్తించిన అర్హులైన వారందరికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
4456 లబ్ధిదారులకు..
జీహెచ్ఎంసీ అలిమ్ కో సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన గుర్తింపు శిబిరాల్లో 4456 లబ్ధిదారులకు రూ.3 కోట్ల 86 లక్షల 80 వేల 286 రూపాయల విలువతో 9250 పరికరాల కొనుగోలుకు ప్రతిపాదించారు. ఇందుకు 837 మంది లబ్ధిదారులు ఏర్పాటు చేసిన క్యాంపుల సందర్భంగా కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రాలేకపోయారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో క్యాంపులకు హాజరైన 4456 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 15 లక్షల 281 రూపాయల విలువ గల 7576 కృత్రిమ అవయవాలను, పరికరాలు, సహాయ పరికరాలను బల్దియా ఉచితంగా పంపిణీ చేయనున్నది.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

