ఎముకల నొప్పులకు ఉచితంగా ఉపశమనం
ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీహాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని తెలుసుకొని వచ్చాను. రోజూ ఫిజియోథెరపీ చేస్తున్నందున వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి.
- ఫ్రీ ఫిజియోథెరపీ సేవలందిస్తున్న ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్
అల్లాపూర్, నవంబర్ 28: వయసు పైబడినా, ప్రమాదంలో గాయపడినా ఎముకల్లో నొప్పి తగ్గాలంటే ఫిజియోథెరపీ తప్పనిసరి. వివిధ అనారోగ్య సమస్యలతో రోజూ ఫిజియోథెరపీకి వెళ్లేవారు ప్రైవేటు దవాఖానలలో లెక్కకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రజలకు మెరుగైన ఫిజియోథెరపీ వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు ముందుక వచ్చారు. సుమారు దశాబ్దం క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీశ్, ప్రస్తుత అధ్యక్షుడు కొలన్ రాధామోహన్రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ను స్థాపించారు.
ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచితంగా ఫిజియోథెరపీ వైద్య సేవలను అందిస్తున్నారు. సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ఫిజియోకేర్ రిహాబిలిటేషన్ కేంద్రం ద్వా రా నగరంలోని వివిధ బస్తీల్లో ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధ్దాశ్రమాల్లోనూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. నాలుగేండ్ల నుంచి కూకట్పల్లి వివేకానందనగర్, మోతీనగర్ కమ్యూనిటిహాల్లో ప్రతి రోజూ ఉ.9 నుంచి మ. 1.గం వరకు తిరిగి సా. 4 నుంచి రాత్రి 8వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. హ్యాండ్ గ్రిప్పర్, టైన్స్, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ స్విస్ బాల్, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో మెరుగ్గా వైద్యం చేస్తుండడంతో బాధితులు త్వరగా కోలుకుంటున్నారు.
అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్..
చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రిల చుట్టూ తిరిగి విసుగుచెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్ ఇస్తాం. వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తరువాత సమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం.
– డాక్టర్ కూరపాటి హరీశ్, ఫిజియోథెరపిస్టు
నొప్పులు తగ్గుతున్నాయి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీహాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని తెలుసుకొని వచ్చాను. రోజూ ఫిజియోథెరపీ చేస్తున్నందున వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. ఉచితంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు.
– అన్నపూర్ణ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- bone pain
- Free relief
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

