నెలాఖరు కల్లా.. 28 e-బస్సులు
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మెంట్, మియాపూర్ డిపోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
- మొదట కంటోన్మెంట్ డిపో నుంచి…
- సిద్ధమవుతున్న ఛార్జింగ్ పాయింట్లు
- ఆర్టీసీకి తగ్గనున్న నిర్వహణ వ్యయం
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మెంట్, మియాపూర్ డిపోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ డిపోకు తొలి విడుతగా 28 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకుంటాయని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సులను తొలుత సికింద్రాబాద్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా..
మణికొండ, జేబీఎస్ నుంచి వయా ఉప్పల్ ఎక్స్‌రోడ్ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు, సికింద్రాబాద్ నుంచి వయా రామ్‌నగర్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌కు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఆయా మార్గాల్లో ప్రయాణికుల రద్ధీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తొలుత ఈ మూడు మార్గాల్లో బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో మియాపూర్ డిపో నుంచి మరో 36 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు.
తగ్గనున్న నిర్వహణ వ్యయం..
నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులను నడిపించడం వల్ల ప్రతి కిలోమీటర్‌పై ఖర్చు బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ఒక కిలోమీటర్‌కు డీజిల్ ఖర్చు రూ.18 అవుతున్నది. అదే ఎలక్ట్రిక్ బస్సుకు ప్రతి కిలోమీటర్‌కు అయ్యే చార్జింగ్ ఖర్చు రూ.6 అవుతుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి కిలోమీటర్‌పై దాదాపు రూ.12 వరకు ఆర్టీసీకి ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఆర్టీసీకి నిర్వహణ వ్యయం తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

