Vikarabad : కొత్త పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

మర్పల్లి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కార్యాలయన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ విధానాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, దళారీ వ్యవస్థ అంతమైపోయి రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు.
రైతు వేదికలు వినియోగించుకుంటున్నారా అంటు మండల వ్యవసాయాధికారిణి వసంతను అడిగి తెలుసుకున్నారు. కొత్త పంటలు, లాభాలు వచ్చే పంటలు పండించాలని రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బస్టాండ్ ఆవరణలో ప్రతి వారం జరిగే సంతవల్ల బస్సులు లోపలికి వెళ్లడం లేదని ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకెళ్లగా మార్కెట్ యార్డులో షెడ్డు నిర్మించి కూరగాయాల మార్కెట్‌ను తరలించాలని అధికారులను ఆదేశించారు. పత్తి రైతులకు అందుబాటులో ఉండేందుకు మోమిన్‌పేట్‌లో పత్తి జిమ్మింగ్ మిల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.
అనంతరం మార్కెట్ కమిటీ సభ్యులను, గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లలిత రమేశ్, జడ్పీటీసీ మధుకర్, ఎంపీటీసీ సంగీత, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం, వైస్ చైర్మన్ లక్ష్మయ్య, డైరెక్టర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్‌గుప్తా, రామేశ్వర్, అశోక్, మధుకర్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

