ఘనంగా ఏరువాక పౌర్ణమి
ఏరువాక పౌర్ణమిని మంగళవారం రైతులు ఆనం దోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో గత రెం డు సంవత్సరాల కాలంగా వేడుకను నిర్వహించుకునే అవకాశం లేకపో వడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించుకునేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్నారు
జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
ఊరూరా ఎడ్లు, బండ్లను అలంకరించి పూజలు చేసిన రైతన్నలు
కొడంగల్, జూన్ 14: ఏరువాక పౌర్ణమిని మంగళవారం రైతులు ఆనం దోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో గత రెం డు సంవత్సరాల కాలంగా వేడుకను నిర్వహించుకునే అవకాశం లేకపో వడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించుకునేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్నారు. కాడెద్దులను ప్రత్యేకంగా అలంకరించి పట్ట ణ వీధుల్లో ఊరేగించారు. ఊరేగింపులో రైతులు కాడెద్దుల ముందు కర్ర సాము, చిం దులు వేస్తూ… ఆనందోత్సహాల నడుమ పండుగను చేసుకున్నా రు. గ్రామదేవతలకు, పశువుల ఘాటికి నైవేద్యాలతో పూజలు నిర్వహించారు వర్షాలు విస్తారంగా కురిసి పంటలు బాగా పండి అధిక దిగుబడి అందేలా వరాన్ని ప్రసాదించాలని రైతులు భగవంతుడిని వేడుకొన్నారు.
తాండూరు రూరల్, జూన్ 14: చెంగోల్, బెల్కటూర్, కరన్కోట, పర్వ తాపూర్, మల్కాపూర్ తదితర గ్రామాల్లో ఎద్దులను ఊరేగించారు. ఎద్దు లకు రంగురంగు దుస్తులు, మూగగంటలు మెడలో వేసి ఊరేగించారు.
పెద్దేముల్, జూన్ 14: మండల పరిధిలోని గాజీపూర్, బుద్దారం, మం బాపూర్, పెద్దే ముల్, జనగాం, కందనెల్లి, నాగులపల్లి, రుద్రారం, ఇందూర్, గొట్లపల్లి, రుక్మా పూర్. రేగొండి,తట్టేపల్లి,అడికిచెర్ల,తింసాన్పల్లి గ్రామాల్లో రైతన్నలు ఘనంగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకొన్నారు.


పరిగి టౌన్, జూన్ 14 : ఏరువాక వేడుకలను మంగళవారం పరిగి పట్టణం తో పాటు వివిధ గ్రామాల్లో రైతులు ఘనంగా జరుపుకొన్నారు. రైతులు తమ పశువులకు రంగు రంగుల డిజైన్తో కూడిన రిబ్బన్లు, మెడలో మూగలు, కాళ్లకు ఘల్లు ఘల్లుమనే గజ్జ లు కట్టి అందంగా అలంకంరించి దేవాలయాల దగ్గర ప్రదక్షిణలు చేయించారు.
కులకచర్ల, జూన్ 14 : కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సంద ర్భంగా గ్రామాల్లో పశువులను అలంకరించి ఆయా గ్రామాల్లో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

