బీ కేర్ పుల్
చలికాలంలో జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వేడి పదార్థాలు తినడంతో పాటు చలి నుంచి రక్షణ పొందేలా స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
- జబ్బులకు కేరాఫ్ చలికాలం..
- భద్రతతోనే ఆరోగ్యం పదిలం
యాలాల, డిసెంబర్ 22 : చలికాలంలో జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వేడి పదార్థాలు తినడంతో పాటు చలి నుంచి రక్షణ పొందేలా స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న వాటితో పాటు తీవ్రమైన గుండెపోటు సమస్యకు దారి తీస్తుంది.
చల్లని వాతావరణం వైరస్ వృద్ధ్దికి కారణం. జలుబుతో బాధపడే వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలుపడే తుంపర్ల ద్వారా వైరస్లు గాలిలో కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా చుట్టుపక్కల ఉన్నవారికి సంక్రమిస్తాయి. ఈ తుంపర్లు అంటుకుపోయిన వస్తువులను తాకిన చేతులతో కండ్లు, ముక్కు రుద్దుకున్నా వైరస్ సోకుతుంది. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికీ ఇంకాస్త త్వరగా వ్యాపిస్తుంది. దీర్ఘకాలవ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇన్పెక్షన్ల సమస్య అధికం..
చల్లగాలికి ఊపిరితిత్తులు, వీటి లోపలి పొరలు విపరీతంగా స్పందిస్తాయి. పొడి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, దూళి ఎక్కువగా కలుస్తుంది. దీంతో అలర్జీ, ఆస్తమా, సీవోడీపీ బాధితులకు దగ్గు, ఆయాసం వంటి సమస్యలు తీవ్రమవుతాయి. కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియా ఇన్ఫెక్షన్లకూ దారి తీయొచ్చు. ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు బయటకు వెళ్తే ముక్కులోని కణజాలం ఉబ్బిపోయి ముక్కుదిబ్బడ వేయవచ్చు. సైనసైటిస్‌తో బాధపడేవారికిది ఎక్కువ చిక్కులు తెచ్చే అవకాశం ఉన్నది.
చల్లని వాతావరణం గుండెకు చేటు..
చల్లని వాతావరణం గుండెకు చేటు చేస్తుంది. చలికాలంలో కొలెస్ట్రాల్, రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే ప్లేట్లెట్ల సంఖ్య పెరగొచ్చు. దీంతో రక్తం చిక్కగా మారి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టిస్తాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇలాంటి గడ్డలు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నది.
సమతుల ఆహారం..
చలికాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సిట్రస్ పండ్లు, భ్రోకలీ, చిలగడదుంపలతో పాటు సీజన్లో దొరికే అన్ని రకాల పండ్లనూ తింటే మంచిది. కాచి చల్లార్చిన నీరు, వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
క్రమం తప్పకుండా వ్యాయామం..
సాధారణ రోజుల్లో మాదిరిగానే చలికాలంలో వ్యాయామం అనేది చాలా ముఖ్యం. శారీరక శ్రమ అనేది శరీర ఆకృతిని మెయింటెన్ చేయడమే కాకుండా మానసిక స్థితిని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యోగా, జిమ్‌లో వ్యాయామం చేయాలి.
జాగ్రత్తలు..
రోజూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇంట్లోకి ఎండ, వెలుతురూ వచ్చేలా కిటికీలు తెరవాలి. చలి పెడుతుందని అస్తమానం ఇంట్లో కూర్చోకుండా నలుగురితో కలవాలి. మిత్రులు, బంధువులతో సరదాగా గడపాలి. చర్మానికి కొబ్బరినూనె రాసుకోవాలి. మాయిశ్చరైజర్లూ వాడుకోవచ్చు. ఇవి చర్మంలో తేమను కాపాడుతాయి. మామూలు సబ్బులకు బదులు గ్లీజరిన్తో కూడిన సబ్బులు వాడుకుంటే మేలు. సున్నిపిండి వాడుకున్నా మంచిదే. ఎండుగజ్జి, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు కలవారు స్వెటర్లు నేరుగా చర్మానికి తగలకుండా చూసుకోవాలి. ముందు నూలు దుస్తులు వేసుకొని, వాటి మీద ఉన్ని దుస్తులు, స్వెటర్లు ధరించాలి. చాలా మందికి చల్లగాలికి పెదాలు పగులుతుంటాయి. వైట్ పెట్రోలియం జెల్లీ పెదాలకు రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Foodstuffs
- Health
- sweaters
- winter
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

