అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దఅంబర్‌పేట బలిజగూడ రోడ్డులోని సర్వేనంబర్ 169, 170, 183, 149, పెద్దఅంబర్‌పేటలోని సర్వేనంబర్ 272, 273లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం జేసీబీ సాయంతో కూల్చివేశారు.
పెద్దఅంబర్‌పేట, మే 25: ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దఅంబర్‌పేట బలిజగూడ రోడ్డులోని సర్వేనంబర్ 169, 170, 183, 149, పెద్దఅంబర్‌పేటలోని సర్వేనంబర్ 272, 273లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం జేసీబీ సాయంతో కూల్చివేశారు. పసుమాముల గ్రామంలోని సర్వేనంబర్ 454లో రోడ్డుకు అడ్డంగా తీసిన పునాది నిర్మాణాన్ని తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి కూల్చివేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనుమతుల్లేకుండా చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి, అసలు నోటీసులే ఇవ్వని చిన్న నిర్మాణాలనే కూల్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

