అక్రమ కట్టడాల కూల్చివేత
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) భవిష్యత్ అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన మూడు ఎకరాల స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు.
- రూ.45 కోట్ల విలువ చేసే 3 ఎకరాల భూమి కబ్జాను అడ్డుకున్న హెచ్ఎండీఏ
- పెద్ద అంబర్పేటలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) భవిష్యత్ అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన మూడు ఎకరాల స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్ఎండీఏ యాజమాన్యం హకులు కలిగిన మూడు ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో హెచ్ఎండీఏ భూ రికార్డులను సరిచూసుకుని స్థానిక తహసీల్దార్, పోలీసుల సహకారంతో హెచ్ఎండీఏ, ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజేషన్ అధికారి వి.విక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ (ఇన్చార్జి) వెంకటేశ్ తమ సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.
ఐదుగురిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్ద అంబర్పేట గ్రామపరిధిలోని 3 ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31న అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి హెచ్ఎండీఏకు అప్పగించారు. ఔటర్ రింగురోడ్డులో భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భూమిని హెచ్ఎండీఏకు కేటాయించిందని అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ భూములను అక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని, ఎంతటివారినైనా ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

