చిన్నారి ఇందు మృతి.. జవహర్‌నగర్‌లో తీవ్ర విషాదం
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి.
- నిన్న అదృశ్యమై.. నేడు చెరువులో శవమై తేలింది
- గంజాయి సేవించే వారి ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం
- కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు
- పోలీసుల జోక్యంతో శాంతించిన కుటుంబ సభ్యులు, స్థానికులు
జవహర్‌నగర్, డిసెంబర్ 16: ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు కంటతడి పెట్టారు. అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారి ఇక లేదని కుటుంబ సభ్యులకు తెలియగానే వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చిన్నారిని చూసేందుకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కంటి తడి పెట్టారు. ఈ ఘటన శుక్రవారం జవహర్‌నగర్ పరిధిలో జరిగింది.
జవహర్‌నగర్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో నరేశ్ కుటుంబ నివసిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె ఇందు (10) దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. ఆమెను గురువారం ఉదయం తండ్రి పాఠశాల వద్ద వదిలి, పనులకు వెళ్లిపోయాడు. గ్రౌండ్లో ఆడుకుంటానని స్నేహితులకు చెప్పి క్లాస్ నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత బాలికను గాలించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కేసు మిస్టరీని ఛేదించారు. అంబేద్కర్‌నగర్ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం ఉన్నదని గమనించిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
చదువుల్లో ఫస్ట్..
దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఇందు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేదని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చేదని ఉపాధ్యాయులు చెప్పారు. ఇంతలోనే ఇందు మరణ వార్త వింటామని అనుకోలేదని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి చదివిస్తున్నాం.. ఇంతలోనే ఘోరం జరిగిందని తల్లిదండ్రులు బోరుమని విలపిస్తున్నారు.
ఇది గంజాయి సేవించే వారిపనే..
దమ్మాయిగూడ ప్రధాన చౌరస్తాకు కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికి గంజాయి సేవించే వారి పనేనని ఆందోళనకు దిగారు. చెరువు పక్కన నిర్మానుష్య ప్రాంతం కావడంతో గంజాయి సేవించే వారికి ఆవాసంగా మారిందని మండిపడ్డారు. నిందితులను వెంటనే పట్టుకుని.. ఇందు కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. పోస్టుమార్టం అనంతరం అంబేద్కర్‌నగర్ చౌరస్తాలో ఇందు మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు నిరసనకు దిగారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శాంతింపజేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Indu
- Jawaharnagar
- marijuana
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

