వర్షాకాలానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధ్దం చేసుకోవాలి
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు.
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక
రంగారెడ్డి, జూన్ 1(నమస్తే తెలంగాణ) : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే వర్షా కాలంలో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో ముంపును అంచనా వేసి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నివాస ప్రాంతాల్లో, రోడ్ల పైన వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ముంపు ప్రాంతాలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలోని నాలాల్లో చెత్త లేకుండా శుభ్రం చేయించాలన్నారు. కాలనీల్లో పర్యటించి ప్రజలతో చర్చించి వర్షాకాలంలో వారు ఎదురొంటున్న సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీల పరిధిలో ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ పనులు జరుగుతుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ప్రమాదాలు జరుగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే ప్రాంతాలను గుర్తించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపల్ అధికారులు సంబంధిత శాఖల వారితో కలిసి సమన్వయంతో పనులు నిర్వహించాలన్నారు. ఎమర్జెన్సీ టీముల్లో ఇరిగేషన్ వారిని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

