ప్రజావాణి సమస్యలకు
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
- రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లు శశాంక, నారాయణరెడ్డి
- ఉమ్మడి జిల్లాలో ‘ప్రజావాణి’లో ఫిర్యాదుల స్వీకరణ
ఇబ్రహీంపట్నం, జనవరి 29 : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, డీఆర్వో సంగీతతో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాఖలవారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ.. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 98 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
205 ఫిర్యాదుల స్వీకరణ
వికారాబాద్, జనవరి 29 : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి 205 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.
వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

