మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. వ్యాపారం, పారిశ్రామిక రంగాల్లో రాణించేలా స్త్రీనిధి, బ్యాంకు లింకేజీలతో రుణాలను అందిస్తూ స్త్రీ సాధికారతకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నది. ఒకప్పుడు వంటింటికే పరిమితమై భర్త, పిల్లలే ప్రపంచంగా బతికిన ఆడబిడ్డలకు వివిధ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి పథకాన్ని చేర్చింది.
ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.3వేల జీవన భృతిని అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుండాలని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ప్రసవమైన తర్వాత ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు ఇస్తున్నది. మానవీయ కోణంలో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ పథకం మహిళల ఆదరణ చూరగొంటున్నది. ఆడబిడ్డ పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకు రాష్ట్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లకు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గణనీయంగా వేతనాలను ఇస్తున్నది. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : సమాజంలో సగభాగమైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వివిధ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నది. ప్రతి పథకాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించి పురుడు పోసుకున్న నాటి నుంచి వృద్ధాప్యం వరకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం మహిళలపై సీఎం కేసీఆర్ చూపుతున్న సానుకూల ధోరణికి అద్దం పడుతున్నది. అర్హులైన పేద మహిళలకు రూ.3వేలను ప్రతి నెలా జీవన భృతిగా అందజేస్తామని ప్రకటించడంతో రంగారెడ్డి జిల్లా మహిళలు సీఎం కేసీఆర్ నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు.
ఆది నుంచీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఆడపిల్ల పుట్టిన నాటినుంచి అడుగడుగునా అండగా నిలుస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుండాలని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. మాతా శిశు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి రూ.12వేలు అందిస్తుండగా.. ఆడ బిడ్డ జన్మిస్తే అదనంగా రూ.వెయ్యి అందిస్తున్నది. మానవీయ కోణంలో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ పథకం మహిళల ఆదరణ చూరగొంటున్నది. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ ద్వారా విరివిగా రుణాలను అందజేసి మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో టీఎస్ఐపాస్ ద్వారా పారిశ్రామికవేత్తలుగా రాణిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలనే లక్ష్యంతో స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. చిరుద్యోగులైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా గణనీయంగా వేతనాలను పెంచడంతో ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్తున్నారు.
మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి పథకం చేర్చడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఎంతో భరోసా ఇస్తున్నది. ఇది నిజంగా గొప్ప పథకం. నిరుపేద మహిళలకు ఓ వరం. ఇది పేదల ప్రభుత్వ మని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. అన్ని వర్గాల మహిళలు ఈ పథకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పథకం కింద నెలకు రూ.3 వేలు అందించడం ద్వారా అర్హులైన నిరుపేదల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలిచినట్టు అవుతుంది. మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ వెంటే మహిళలు ఉన్నారు.
– వడ్డేపల్లి విద్యారెడ్డి, కౌన్సిలర్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్హులైన ప్రతి మహిళలందరికీ ప్రతి నెలా రూ.3 వేల జీవనభృతి ఇస్తానని ప్రకటించడం అభినందనీయం. నెల నెలా జీవన భృతి అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు తీపికబురు చెప్పారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పథకం అమల్లోకి వస్తే ఆడపడుచులు ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్‌కు తప్పకుండా రుణపడి ఉంటారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇద్దాం.
– ధర్మిబాయి, ఊరెంటితండా, పెద్దేముల్
దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ సర్కారు మహిళల సంక్షేమానికి ఎంతో కృషి చేసున్నది. బీఆర్ఎస్ హయాంలోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బీఆర్ఎస్ మ్యాని ఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా బీపీఎల్ కింద ఉన్న మహి ళలకు రూ.3వేల గౌరవభృతి ప్రకటించడం హర్షణీయం. మహి ళల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే మేం ఉంటాం. మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి కారు గుర్తుకే ఓటు వేయాలి. ప్రపంచ చరిత్రలోనే మహిళా సాధికారతను ఆచరణలో చూపించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణలో మహిళా సాధికారత ఆచరణలో సాధించి చూపిస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకుంటాం. కేసీఆర్‌ను సీఎం చేయడానికి అందరూ మద్దతు ఇవ్వాలి.
– చంద్రకళ, గాంధీనగర్ కాలనీ, షాద్‌నగర్
మహిళలకు జీవనభృతి హర్షణీయం
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేద మహిళకు ప్రతి నెలా రూ.3వేలు అందిస్తానని సీఎం ప్రకటించడం హర్షణీయం. తెలంగాణలో మహిళలు ఆత్మగౌరవంతో మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళా లోకానికి సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో శుభవార్త చెప్పడంతో మహిళలు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క మహిళ కోరుకొంటున్నది. ఏది ఏమైనా మహిళలను అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్ని స్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.
– టి.భాగమ్మ, హన్మాపూర్, పెద్దేముల్
పేద మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సౌభాగ్య లక్ష్మి పథకం చాలా బాగున్నది. సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన పేద మహిళలకు జీవనభృతి నెలకు రూ.3వేలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యాని ఫెస్టో అద్భుతంగా ఉన్నది. ఈ పథకం పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోతో బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళల కు కొత్తగా నెలకు రూ.3వేల గౌవర భృతి వస్తుంది. దీంతో పాటు మహిళల సంక్షేమానికి కేసీఆర్ సారు అనేక పథకాలు చేపట్టి వారికి అండగా ఉంటున్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే పేద మహిళలకు భరోసా. అయనకే మా మద్దతు.
– దండు మల్లమ్మ, చేవెళ్ల టౌన్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించారు. సౌభాగ్యలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3వేల జీవనభృతి కల్పిస్తామని హామీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళల కుటుంబాలకు భరోసాని స్తున్నది. ప్రతి పేదవాడి కుటుంబంలో కేసీఆర్ దేవుడు. మా ఓటు కేసీఆర్‌కే వేస్తాం. మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందించే నాయకుడే సీఎం కేసీఆర్.
– రజిత, మాడ్గుల
సీఎం కేసీఆర్ సార్ పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరి జీవితాల్లో వెలుగులు నిండాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అదెరువు అవుతుండడంతో కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమం కోసం సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడతామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉన్నది. అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల జీవనభృతి అందిస్తామని ప్రకటించడం హర్షణీయం. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నది. కుటుంబ పోషణలో కీలకంగా వ్యవహరించే మహిళలకు అన్ని విధాలుగా మేలు చేయనున్నది. గతంలో పాలించిన కాంగ్రెస్ నాయకులు పేదల దిక్కు చూడలేదు. నిరుపేదలకు లబ్ధి చేకూరుస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈసారి జరిగే ఎన్నికల్లో మళ్లీ కారు గుర్తుకు ఓటు వేస్తా. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి.
– లక్ష్మమ్మ, కడ్తాల్
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని వి ధంగా మహిళల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. ప్రతి రంగంలో మహిళల కు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందు కెళ్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా నెలకు రూ.3వేలు భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో యావత్ తెలంగాణ మహిళా లోకం సంతోషం వ్యక్తం చేసున్నది. మహిళలంతా సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉంటారు.
– కట్న లత, ఎంపీటీసీ, వీర్లపల్లి
మ్యానిఫెస్టో పేదలకు అనుకూలంగా ఉ న్నది. అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ భృతి అందించాలనే నిర్ణయం సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శ నం. ఈ పథకాన్ని రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే లీడర్ కేసీఆర్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే కుటుంబం బాగుంటుంది. ఈ పథకం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపడం ఖాయం.
– శేరి స్వర్ణలతాదర్శన్, సర్పంచ్, ముడిమ్యాల్, చేవెళ్ల
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో సౌభాగ్యలక్ష్మి పథకంతో మహిళలకు భరోసా కల్పించింది. మ్యానిఫెస్టోలో పెట్టిన సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎంతో ధైర్యా న్ని ఇచ్చింది. మహిళలకు ఈ పథకం ద్వారా రూ.3వేలు అందించనున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నారు.. గెలిచాక అమలు చేసి తీరుతారు. అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి పథకం అందేలా చూస్తారు. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించి, మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటాం. కారు గుర్తుకు ఓటువేసి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. మహిళల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– పి.అనంతలక్ష్మి, మోమిన్‌కలాన్, ధారూరు
సీఎం కేసీఆర్‌కు మహిళలు అంటే ఎం తో గౌరవం. వారు కూడా అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది పురుషులతో సమా నంగా పోటీ పడాలనే లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ ముబారాక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తదితర పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ మ్యానిఫెస్టోలో తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట రూ.3 వేల జీవన భృతిని అందజేస్త్తామ నడం గొప్ప వరం. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.
– వగ్గు మమత, ఆమనగల్లు
సౌభాగ్యలక్ష్మి పథకం ఆలోచనే చాలా గొప్పది. ఎంతోమంది నిరుపేదలకు ఈ పథకం ఆసరాగా నిలుస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు. సౌభా గ్యలక్ష్మి కింద అర్హులకు నెలకు రూ.3 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో లో చేర్చడంతోనే మరోసారి గెలుపును ఖాయం చేసుకున్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు. కేసీఆర్ ఆడబిడ్డ ల పక్షపాతి అని చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఆర్థికంగా అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ వెంటే ప్రతి ఆడబిడ్డ నడుస్తున్నది. సౌభాగ్యలక్ష్మి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– తొండాపు రోహిణిరెడ్డి, కౌన్సిలర్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ
సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు రూ.3వేలు అంది స్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపర్చడం చాలా మంచి నిర్ణయం. దీంతో మహిళలు ఎవరి దగ్గర చేతులు చాచే అవసరం ఉండదు. వారికి బతుకుపై మరింత భరోసానిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగాలని మొదటి నుంచి కృషి చేస్తున్నది. ఇలాంటి ప్రభుత్వాన్ని వదులు కోవడానికి మహిళలు సిద్ధంగా లేరు. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం. అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.
– అర్ఛన, దామర్చేడ్, బషీరాబాద్