గులాబీ గుబాళింపు
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్‌ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు.
- బీఆర్ఎస్లో పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
- సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు
- మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలను వీడి బీఆర్ఎస్ చెంతకు..
- తిరుగులేని శక్తిగా అవతరిస్తున్న గులాబీ పార్టీ.. ఎన్నికల సమరంలోదూకుడుగా ముందుకు..
కోట్‌పల్లి, నవంబర్ 03 : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్‌ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. మండల పరిధిలోని కొత్తపల్లి, జిన్నారం గ్రామా ల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కొంత మంది నాయకులు కాం గ్రెస్‌ను వీడి ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు.
ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విజయం ఖాయమన్నా రు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిం చాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు మల్లయ్య, వెంకటేశ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..
వికారాబాద్ : కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి వికారాబాద్ ఎన్నికల ఇన్చార్జి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ కోట్‌పల్లి మండలం ఎన్కెపల్లికి రావడంతో సోషల్ మీడియా కన్వీనర్ పి.ప్రభాకర్ రెడ్డి గ్రా మానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎంపీ సమక్షంలో గులాబీ కండువాలు క ప్పుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియ ర్ నాయకుడు దశరథ్ గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సత్యం పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

