ఎల్ఈడీ…ఖర్చు తగ్గి
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న మార్గాలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు వచ్చేలా నగరంలో ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు శ్రీకారం చుట్టారు.
- ఖజానాకు రూ.570 కోట్లు ఆదా
- జీహెచ్ఎంసీలో గణనీయంగా తగ్గిన విద్యుత్ బిల్లుల భారం
- 5.26 లక్షల ఎల్ఈడీ దీపాలు బిగింపు
- సమర్థవంతంగా వీధి దీపాల నిర్వహణ
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న మార్గాలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు వచ్చేలా నగరంలో ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 5.26 లక్షల ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయగా…తద్వారా రూ. 570 కోట్ల మేర ఆదా చేసుకున్నది. కాగా గతంలో వీధి దీపాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సమస్యగా ఉండేది. వీధి దీపాలకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చవ్వడమే కాకుండా విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చేవి. వీధి దీపాలు వేసేందుకు, ఆపేందుకు ప్రత్యేకంగా మనుషులు అవసరమయ్యే వారు. వారికి వేతనాలకు కూడా బోలెడంత ఖర్చయ్యేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో 5లక్షల 26,136 వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ దీపాలను అమర్చారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న వనరులను ప్రోత్సహించడం, మెరుగైన వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, పబ్లిక్ రంగ సంస్థ (ఎన్టీపీసీ) జాయింట్ వెంచర్తో పనిచేస్తుందని చెప్పారు. వీధి దీపాల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- electricity bills
- GHMC
- LED
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

