వికారాబాద్, ఏప్రిల్ 1 : వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఈ నెల 3న వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్హాల్లో నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సోమవారం తెలిపారు.
ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.