Bonalu : గోపాల్పూర్లో ఘనంగా బోనాలు..

పెద్దేముల్ : మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగను ఆదివారం గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు యువతులు అమ్మవారికి బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామ దేవత ఊరడమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహిస్తూ బోనాలు, నైవేద్యన్ని సమర్పించారు. ఊరడమ్మ పండుగలో బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకాలు అందరిని ఆకట్టుకున్నాయి.
నిర్వహకులు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పండుగలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

