బొంరాస్ పేట : బొంరాస్ పేట మండల పరిషత్ తదుపరి వైస్ ఎంపీపీగా తనకు అవకాశం కల్పించినందుకు బురాన్‌పూర్ ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డి శనివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో తాలుకా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్, బురాన్‌పూర్ మాజీ ఎంపీటీసీ సురేశ్ కుమార్, ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
వైస్ ఎంపీపీ పదవికి నారాయణరెడ్డి ఇటీవల రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో వైస్ ఎంపీపీగా బురాన్‌పూర్ ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డిని ఎంపీటీసీలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే.