బాధ్యతాయుతంగా నడుచుకోవాలి..
శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్

షాద్‌నగర్‌టౌన్ : ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతయుతంగా నడుచుకోవాలని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ అన్నారు. శనివారం షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో రైడ్ సెఫ్ రీడ్ సెఫ్ బైకు ర్యాలీని షాద్‌నగర్ ఏసీపీ కుశల్కర్, కళాకారుడు బిత్తిరి సత్తి, కొమరం, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ లావణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ డ్రైవింగ్ చేయడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగవన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతోనే తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణంలోని అన్ని యూనియన్లను ఏకతాటిపై తీసుకొచ్చి సుమారు 3వేల వాహనాలతో భారీ బైకు ర్యాలీ నిర్వహించిన ఎస్ఐ రఘుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా భారీ బైకు ర్యాలీని పరిశీలించిన తెలంగాణ బుక్ఆఫ్ రికార్డు చైర్మన్, ఫౌండర్ వెంకటచారి ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ కుశల్కర్తో కలిసి ఎస్ఐ రఘుకుమార్‌కు తెలంగాణ బుక్ఆఫ్ రికార్డు రాష్ట్ర అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చలి నర్సింహా, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, సలేంద్రం రాజేశ్వర్, నాయకులు, యూనియన్ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

