Bhatukamma : పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన ఉపాధ్యాయులు

కడ్తాల్ : మండలంలోని ఫార్చ్యూన్ బట్టర్‌ప్లై స్కూల్లో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ శేషగిరిరావు, వైస్ చైర్మన్ రమేశ్‌బాబు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, నేటి తరం యువతకు బతుకమ్మ గురించి తెలుపవలిసిన అవసరం మనందరిపైన ఉన్నదని తెలిపారు. దసరా, బతుకమ్మల ప్రాముఖ్యతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం విద్యార్థినులు సంప్రదాయక బట్టలు ధరించి, వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు.
విద్యార్థినులు మహిళ ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, ఉషారుగా ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. అంతకుముందు పాఠశాలలో విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంజీవ్నాంపల్లి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

