గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పేరునే కొనసాగించాలి
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పేరును మీర్ఖాన్పేట పోలీస్ స్టేషన్‌గా మార్చడం సరికాదని, వెంటనే పీఎస్ పేరును యథావిధిగా మార్చాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాచారం, అక్టోబర్14: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పేరును మీర్ఖాన్పేట పోలీస్ స్టేషన్‌గా మార్చడం సరికాదని, వెంటనే పీఎస్ పేరును యథావిధిగా మార్చాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా రంగారెడ్డి జిల్లా యచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పేరుతో పోలీస్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
మేడిపల్లి గ్రామంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను ఇటీవలే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాలతో కుర్మిద్ద గ్రామానికి తరలించినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను కుర్మిద్ద గ్రామానికి తరలించడమే కాకుండా ఏకంగా పీఎస్ పేరును మీర్ఖాన్పేట పోలీస్‌స్టేషన్‌గా పేరు మార్చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలలో పెద్ద మొత్తంలో భూములు సేకరించిన ప్రభుత్వం తక్కువ భూములు సేకరించిన కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామం పేరుతో పోలీస్‌స్టేషన్ పేరు మార్చడం సిగ్గు చేటన్నారు.
ఏది ఏమైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గతంలో మాధిరిగా మేడిపల్లి గ్రామంలో ఉన్న క్రీడా మైదానం స్థలంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటి పేరుతో నూతన పీఎస్ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

