తాగునీటి బిల్లుల మోత.. నీళ్లు రాకున్నా రీడింగ్ చూపుతున్న ఆటోమెటిక్ మీటర్ రీడర్లు
గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్‌హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీటి మీటర్ల రీడర్ల పనితీరు కలవరపెడుతున్నది.
- రూ.లక్షల్లో బిల్లులు రావడంతో జనం ఇబ్బందులు
- పట్టించుకోని ఏజెన్సీలు, జలమండలి అధికారులు
సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్‌హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీటి మీటర్ల రీడర్ల పనితీరు కలవరపెడుతున్నది. మెకానికల్ మీటర్ రీడర్లు చెడిపోవడంతో.. జలమండలి సిబ్బంది యావరేజీ పేరిట పెద్దఎత్తున బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఆటోమేటెడ్ మీటర్ల పనితీరు వినియోగదారులను కలవర పెడుతున్నది. నీళ్లు రాకున్నా రీడింగ్ తిరుగుతూ లక్షలాది రూపాయల బిల్లులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చాలాచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా మీట ర్ రీడర్ ఏజెన్సీలు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నా యి. ఏజెన్సీ సిబ్బంది మీటర్లు బిగించడం వరకే పరిమితమవుతున్నారని.. రిపేర్లు వచ్చినా చేసేందుకు రావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్లలో వేలాది రూపాయలతో ఏర్పాటు చేసుకున్న మీటర్లు సరిగ్గా పనిచేయకపోవడం.. నీళ్లు రాకున్నా రీడింగ్ చూపించడంతో లక్షలాది బిల్లులు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
నెలకు రూ.లక్ష బిల్లు..
మాసబ్‌ట్యాంక్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌కు ఆటోమేటెడ్ మీటర్ రీడర్ బిగించుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 20వేల లీటర్ల నీళ్లు సరిపోతుండటంతో ఇంతకాలం ఆ అపార్ట్మెంట్ వాసులకు బిల్లు కట్టాల్సిన పరిస్థితి రాలే దు. కానీ, గత కొద్ది రోజులుగా నెలకు రూ. లక్షకు పైగానే బిల్లు వస్తున్నది. ఉచితంగా వచ్చే నీళ్లే సరిపోయే అపార్ట్‌మెంట్‌కు ఏకం గా లక్ష రూపాయలకు పైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యారు. మీటర్ రీడర్‌ను పరిశీలిస్తే నీళ్లు రాకున్నా రీడింగ్ తిరుగుతూనే ఉన్నది. రోజంతా తిరుగుతుండటంతో బిల్లు పెరిగిపోతున్నది. ఇదే పరిస్థితి నగరంలోని చాలాచోట్ల ఉన్నది. దీంతో బాధితులు జలమండలి ప్రధాన కార్యాలయానికి వరుస కడుతున్నారు. మీటర్ రీడర్ ఏజెన్సీలు మరమ్మతులకు రాకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నీటిని వాడుకోకున్నా లక్షలాది రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలున్న ప్రాంతాల్లో మీటర్ రీడర్ ఏజెన్సీలను అలర్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

