Summer | మార్చిలోనే మాడ్చి.. మాడ్చి.. ఉదయం 9 గంటల నుంచే సెగలు కక్కుతున్న భానుడు
ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
- బయటికి రావాలంటేనే జంకుతున్న జనం
- వడదెబ్బ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
- శీతలపానీయాలు తీసుకుంటే మంచిదని సూచన
- ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందే మోనని ఆందోళన
- రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- పగలు ఉక్కపోత.. రాత్రి చలి పంజా
- కొన్ని రోజులుగా విభిన్న వాతావరణం
- బయటికి వెళ్లాలంటేనే జంకుతున్న జనం.. నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
- ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యనిపుణులు
ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో 35 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు వెంట తీసుకెళ్లాలని, ఓఆర్ఎస్, కొబ్బరి బొండం, నిమ్మకాయ రసం, లస్సీ, పండ్ల రసాలు వంటి శీతలపానీయాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
షాబాద్, మార్చి 12 : ఎండలు ముదురుతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా 36.7, శనివారం 36.5, ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 35.1 నమోదైంది. ఉదయం తొమ్మిది గంటలు దాటిందంటే భానుడు భగభగ మండుతుండటంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఇప్పటికే ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుండగా ..అటు ఉక్కపోత నుం చి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్టోగ్రతలు 30-35 డిగ్రీల వరకు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి..
మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు మార్చి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రత లు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం తీవ్ర చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడం తో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలిప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరుగుతున్నది. రోడ్లు నిర్మాను ష్యంగా మారుతున్నాయి. పెండ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలు తలకు టవల్, టోపీలు, గొడుగులు ధరించి కనపడుతున్నారు. పనుల నిమిత్తం బయటికి వెళ్లాల్సి వస్తే ఉద యం, సాయంత్రం వేళలను ఎంచుకుంటున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఎం డల తీవ్రత ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతు లు, కూలీలు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, నిమ్మకాయ పానీయాలు, లస్సీ, పండ్ల రసాలు తాగుతున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో..
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలతోపాటు రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. రాత్రి పూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. ప్రతిరోజూ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వైరల్ జ్వరాలు పెరిగాయి. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దినసరి కూలీలు ఉదయం సమయంలోనే పనులను పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని వైద్య నిపుణు లు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాల్సిన వారు తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. వడగాడ్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం బయటికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంటున్నారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఎండల తీవ్రత పెరుగుతున్నది. ప్రజలు మండుటెండల్లో బయట తిరగొద్దు. వేడి గాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. పనులుంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో పూర్తి చేసుకోవాలి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బయటకెళ్లే సమయంలో గొడు గును వెంట తీసుకెళ్లాలి.
-డాక్టర్ దామోదర్, ఉప వైద్యాధికారి రంగారెడ్డి జిల్లా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

