Amangallu : వ్యాపార అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి

ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని వ్యాపారం చేయాలని డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమనగల్లు మండల మహిళా సమైఖ్య కార్యాలయం ఆవరణలో ఏపీఎం కృష్ణయ్య ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు, ఏపీఎంలు, సీసీలు హాజరయ్యారు. సమావేశంలో ఆయా మండలల్లో ఉన్న 901 గ్రూపు మహిళా సంఘాల సభ్యులకు నూతన వ్యాపారాల కోసం వ్యాపార ప్రణాళికలు రూపొందించి సమావేశంలో తీర్మానం చేశారు.
అనంతరం 762 గ్రూపు మహిళలకు వ్యాపారాల కోసం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, కమ్యూనిటీ, ఇన్వెస్ట్ ఫౌండు ద్వారా రుణాలు ఇప్పించి గ్రౌండింగ్ చేశారు. వ్యాపారం కోసం రుణాలు తీసుకున్న మహిళ గ్రూపు సభ్యులంతా 12 శాతం వడ్డీతో 12నెలల్లో రుణాలను చెల్లించాలని సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయ సకారాలను అందిస్తుందని అవకాశాలను మహిళలంతా అందిపుచ్చుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యాపార నైపుణ్యాలను పెంచుకొని ఉన్నతంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏపీఎం నర్సింహ, మండల సమైఖ్య అధ్యక్షురాలు నిర్మల, ఏపీఎంలు వెంకట్రెడ్డి, రాజేశ్వరి, కో-ఆర్డినేటర్లు శైలజ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

