తీరోక్క పూల సంబురం..
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ వేదికపై ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నా యి. ప్రధానంగా ట్యాంక్‌బండ్ కేంద్రంగా బతుకమ్మ సంబురాలు ఇంద్రధనుస్సు వర్ణాలలో అత్యంత మనోహరంగా జరుగనున్నాయి.
- నేడే సద్దుల బతుకమ్మ
- ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్‌బండ్ పరిసరాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ వేదికపై ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నా యి. ప్రధానంగా ట్యాంక్‌బండ్ కేంద్రంగా బతుకమ్మ సంబురాలు ఇంద్రధనుస్సు వర్ణాలలో అత్యంత మనోహరంగా జరుగనున్నాయి. ‘శ్రీలక్ష్మి నీ మహిమలూ.. గౌరమ్మ చిత్రమై తోచునమ్మా…, ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల ఉయ్యాలో’ లాంటి పాటలతో నగరం హోరెత్తనున్నది. విభిన్న రకాల పాటలతో బతుకమ్మల చుట్టూ మహిళలు చప్పట్లతో కోలాటమేస్తూ బతుకమ్మల చుట్టూరా తిరుగుతూ ఆడి పాడుతారు.

మరికొంత మంది మహిళలు కోలాటం, ఉయ్యాలూగుతూ సందడి చేస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నగరమంతా పూలు పరుచుకున్నాయా..! అన్నట్టు దర్శనమివ్వనున్నాయి నేడు నగర వీధులు. బతుకమ్మలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ బతుకమ్మకు వేదికలుగా మారునున్నాయి. నగరంలో ఎక్కడికక్కడ బతుకమ్మ ఆడుకునేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. డీజేలు, లైవ్ మ్యూజిక్లతో బతుకమ్మ కేంద్రాలు సందడి తలపించనున్నాయి.
దాండియా ఆటలు ఆడి..

నగరంలో శనివారం మహా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని కంట్రీ క్లబ్, గేటెడ్ కాలనీల్లో అమ్మవారి వేదిక ఎదుట మహిళలు, చిన్నారులు, యువతులు దాండియా ఆడి అలరించారు. గార్భా డ్యాన్స్‌లతో పాటు కోలాటం, లైవ్ మ్యూజిక్, సింగింగ్ పర్ఫామెన్స్‌లతో సందడి చేశారు. అందులో భాగంగా సంప్రదాయ వంటకాలు తయా రు చేసుకుని అందరు కలిసి భోజనాలు చేస్తూ సంతోషంగా గడిపారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ)
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

