మూడంచెల భద్రత
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
- 7 జిల్లాలు, 29 నియోజకవర్గాలు, 20 కౌంటింగ్ సెంటర్లలో
- సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..
సిటీబ్యూరో, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఈనెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని అధికారులు కోరారు.
ఈవీఎం, వీవీ ప్యాట్స్ భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద గట్టి భద్రత, సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన 20 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వివరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

