లక్ష్యం చేరలే !
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరగా.. ఈసారి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేరలో జరుగలేదు. 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 10,341.600 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు.
- 33 కేంద్రాలకుగాను 19 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు
- అంచనా..40వేల మెట్రిక్ టన్నులు.. కొన్నది 10,341 మెట్రిక్ టన్నులే..
- కొనుగోళ్లు తగ్గడానికి కారణం ధాన్యం ప్రైవేటుకు తరలివెళ్లడమే..
- రూ.22కోట్ల బకాయిలకు.. చెల్లించింది రూ.12.25 కోట్లు మాత్రమే
రంగారెడ్డి, మే 31(నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరగా.. ఈసారి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేరలో జరుగలేదు. 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 10,341.600 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా.. 19 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగాయి. మిగిలిన 14 కేంద్రాలకు పిడికెడు ధాన్యం కూడా రాలేదు. దాదాపు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినట్లేనని, రెండు, మూడు కేంద్రాల్లో కొద్దిపాటిగా ధాన్యం మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
దీంతో ఈసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సందేహాస్పదమే కానున్నది. సన్నవడ్లకు కొనుగోలు కేంద్రాల్లో చెల్లిస్తున్న మద్దతు ధర కంటే బయటి మార్కెట్లో ఎక్కువగా ఉండడంతో చాలా మంది రైతులు ప్రైవేటుగా వ్యాపారులకు అమ్ముకున్నారు. ఈ కారణంగా షాద్నగర్, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతుల నుంచి ధాన్యం రాలేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో అత్యధికంగా దొడ్డు రకమే ఉన్నది.
రైతుల ఖాతాల్లో రూ.12.25కోట్లు జమ..
కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి రూ.22కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.12.25 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.9.75కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కేంద్రాల్లో ఓపీఎంఎస్ ఎంట్రీస్ పూర్తి చేసి బిల్లులను సివిల్ సప్లయ్ అధికారులకు పంపడంలో ఆలస్యం జరుగడం వల్ల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఆన్లైన్లో వివరాలు సరిగా లేకపోవడం వంటి వివిధ కారణాలతో డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓపీఎంఎస్ ఎంట్రీస్ పూర్తయి, బిల్లులు సమర్పించిన ఒక్కరోజులోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమ చేస్తున్నామని అధికారులకు చెబుతున్నారు.
డబ్బుల కొరత లేదు : విజయలక్ష్మి, డీఎం, సివిల్ సప్లయ్, రంగారెడ్డి జిల్లా
ధాన్యం డబ్బుల చెల్లింపునకు నిధుల కొరత లేదు. ప్రతి రోజూ రెండు పర్యాయాలు సివిల్ సప్లయ్ శాఖకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ వస్తున్నది. కొనుగోలు కేంద్రాల నుంచి బిల్లులు వచ్చిన ఒక్క రోజులోనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని కేంద్రాలకు కొద్దిపాటిగా ధాన్యం వస్తున్నది. ఇది పూర్తయితే జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసినట్లే.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

