మంగళవారం 02 జూన్ 2020
Rajanna-siricilla - Feb 27, 2020 , 00:50:20

మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించడం అదృష్టం

మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించడం అదృష్టం

ముస్తాబాద్‌: మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించడం సిరిసిల్ల జిల్లా వాసుల అదృష్టమని రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల సర్పంచ్‌ వజ్రవ్వ కుమారుడు పరమేశ్వర్‌, ముస్తాబాద్‌ మండలం మద్దికుంటకు చెందిన  వర్ష వివాహ వేడుకను మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్‌లో బుధవారం నిర్వహించగా ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మంత్రికి పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాన్ని  బహూకరించారు. అనంతరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనాన్ని సందర్శించి నిర్మాణం బాగుందని కితాబిచ్చారు. అనంతరం  మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రభుత్వ పథకాల అమలు తీరు, మండలాభివృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాంతం  కాళేశ్వర జలాలతో పూర్తిగా సస్యశ్యామలం అవుతుందని వివరించారు. కార్యక్రమంలో  ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ  గుండం నర్సయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, సెస్‌ డైరెక్టర్‌ ఏనుగు విజయరామారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బోంపల్లి సురేందర్‌రావు, సర్పంచ్‌ సుమతి, ఏఎంసీ చైర్మన్‌ యాది మల్లేశ్‌యాదవ్‌, నాయకులు అక్కరాజు శ్రీనివాస్‌, సర్వర్‌పాషా, కొమ్ము బాలయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు సంతోష్‌రావు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo