గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Apr 27, 2020 , 01:48:27

ప్రజల పార్టీ టీఆర్‌ఎస్‌

ప్రజల పార్టీ టీఆర్‌ఎస్‌

  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకె

చొప్పదండి, నమస్తేతెలంగాణ/ రామడుగు/ మల్యాల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ప్రజల పార్టీగా గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ రంగు, కేసీఆర్‌ ముఖచిత్రంతో తయారు చేసిన మాస్కులను ఆదివారం ఆయన చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. మాస్కుల తయారీకి ఆర్డర్‌ ఇచ్చి చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించిన ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. అనంతరం చొప్పదండి మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ. మూడు లక్షల 20 వేల 500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ పంపించిన వంద మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, ఎంపీపీ చిలుక రవి, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్‌రావు, విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్‌రావు, వొంటెల మురళీకృష్ణారెడ్డి, వెల్మ మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ రామడుగు మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, మల్యాల సర్పంచ్‌ మిట్టపెల్లి సుదర్శన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.