శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 28, 2020 , 02:33:21

బల్దియాల్లో నవశకం

బల్దియాల్లో నవశకం

గోదావరిఖనిటౌన్‌/ పెద్దపల్లిటౌన్‌/మంథని టౌన్‌) 

జిల్లాలోని ఒక కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలకు ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించారు. రామగుండంలో 50 డివిజన్లు ఉండగా, మిగతా మూడు మున్సిపాలిటీల్లో 64 వార్డులు ఉన్నాయి. అయితే పెద్దపల్లిలో ఏకగ్రీవమైన రెండు వార్డులు పోను మిగతా 62 వార్డులు, 50 డివిజన్ల  కు 623 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 25న కౌటింగ్‌ నిర్వహించి, ఫలితాలను వెల్లడించారు. రామగుండంలో 50 మంది, పెద్దపల్లిలో 36మంది, సుల్తానాబాద్‌లో 15 మంది, మంథనిలో 13 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులతో సో మవారం కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. అనంతరం వీరందరితో ఆయా బల్దియాల్లో ప్రత్యేకాధికారులు ప్రమా ణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో అధ్యక్ష ఉపాధ్యక్షులను చెయ్యెత్తే పద్ధతిలో ఎన్నుకున్నారు. నాలుగు చోట్లా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే పీఠాలను అధిరోహించారు. రామగుండం కార్పొరేషన్‌లో మే యర్‌గా బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌గా నడిపల్లి అభిషేక్‌రావు, పెద్దపల్లిలో చైర్‌పర్సన్‌గా చిట్టిరెడ్డి మమతారెడ్డి, వైస్‌చైర్‌పర్సన్‌గా సుల్తానామొబీన్‌, సుల్తానాబాద్‌లో చైర్‌పర్సన్‌గా ముత్యం సునీత, వైస్‌చైర్‌పర్సన్‌గా బిరుదు సమత, మంథనిలో చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ, వైస్‌చైర్‌పర్సన్‌గా ఆరెపల్లి కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

రామగుండం మేయర్‌గా అనిల్‌కుమార్‌

 రామగుండం మేయర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌గా నడిపల్లి అభిషేక్‌రావు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 50 మంది సభ్యులు హాజరయ్యారు. సభ్యులందరిని పెద్దపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి ముందు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక షెడ్యూల్‌ను జేసీ ప్రకటించగా, మేయర్‌ అభ్యర్థిగా బంగి అనిల్‌కుమార్‌ను సభలోని సభ్యుడు పా ముకుంట్ల భాస్కర్‌ ప్రతిపాదించగా మరో సభ్యుడు కన్నూరి సతీశ్‌కుమార్‌ బలపర్చారు. అనంతరం చైర్‌పర్సన్‌ సూచన మేరకు మేయర్‌గా బంగి అనిల్‌కుమార్‌ను అంగీకరిస్తూ సభ్యులంతా చేతులెత్తి మద్దతు ప్రకటించడంతో బంగి అనిల్‌కుమార్‌ను మేయర్‌గా చైర్‌పర్సన్‌ ప్రకటించారు.

పెద్దపల్లి చైర్‌పర్సన్‌గా మమతారెడ్డి

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21వ వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన చిట్టిరెడ్డి మమత, వైస్‌ చైర్మన్‌గా ఆదే పార్టీకి చెందిన 36వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ నజ్మీన్‌ సుల్తానాను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేయగా, మేయర్‌ అభ్యర్థిటా చిట్టిరెడ్డి మమత పేరును 26వ వార్డు కౌన్సిలర్‌ సదమళ్ల అమ్రేశ్‌ ప్రతిపాదించగా, 29వ  వార్డు కౌన్సిలర్‌ ఇల్లందుల కృష్ణమూర్తి బలపర్చారు. ఎవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నికల చిట్టిరెడ్డి మమత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 

సుల్తానాబాద్‌ చైర్‌పర్సన్‌గా సునీత

నూతనంగా ఏర్పడ్డ సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ముత్యం సునీత, వైస్‌ చైర్మన్‌గా బిరుదు సమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీల్డ్‌ కవర్‌లో అభ్యర్థుల పేర్లను ఉంచడంతో చివరి వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులేవరనేది తెలియక ఉత్కంఠ నెలకొంది. చివరికి మధ్యాహ్నం 12.30 గంటలకు సీల్డ్‌ కవర్‌లో అధిష్టానం పంపిన పేరును 7వ వార్డు సభ్యుడు కూకట్ల గోపి చైర్మన్‌ అభ్యర్థిగా ముత్యం సునీత బలపరుస్తున్నట్లు ప్రకటించడంతో ఉత్కంఠతకు తె రపడింది. సునీతను 13 మంది సభ్యులు మద్దతు తెలుపడంతో చైర్‌పర్సన్‌గా,  వైస్‌ చైర్మన్‌గా సమత ఎన్నికయ్యారు. 

మంథని చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ

మంథని మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది.  సోమవారం నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఎన్నికల ప్రొసిడింగ్‌ అధికారి శెట్టి చంద్రప్రకాశ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గుట్టల మల్లిఖార్జునస్వామి ప్రమాణ స్వీకా రం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పుట్ట శైలజ పేరును 1వ వార్డు కౌన్సిలర్‌ గుండా విజయలక్ష్మి ప్రతిపాదించగా, 5వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి నక్క నాగేంద్ర బలపర్చారు. చైర్‌పర్సన్‌ రేసులో పుట్ట శైలజ ఒక్క రే ఉండడంతో సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఆరెపల్లి కుమార్‌ ఎన్నికయ్యారు.

శ్రేణుల సంబురాలు..

జిల్లాలోని ఒక కార్పొరేషన్‌తోపాటు మూడు ము న్సిపాల్టీలనూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథనిలో పటాకలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. 


logo