గుమ్మి = కాగు, ఈత పుల్లలతో తయారు చేసిన ఇసిరె (పోరగాళ్లను తిండికి సంపుతడు.. ఏది అడిగినా డబ్బుల్లేవ్ అంటడు.. గుమ్మిల అడ్లు.. గుమ్మిలనే ఉండాలె.. గుత్పలోలె
బిడ్డలుండాలంటే ఎట్ల?)
ఉప్పిస = కశం కశం, వంటల్లో ఉప్పు ఎక్కువైతే అంటరు
(ఎవ్వల్జేసిర్రు బువ్వకూరలు..? కూర్ల ఎవరన్న ఇంతగనం ఉప్పేసుకుంటర? కూరంత ఉప్పిస.. ముద్ద నోట్లవెడితే వాంతికొస్తంది)
మష్కింద పేగు = మసిగుడ్డ (అయ్యో.. పొయ్యిమీద బువ్వ పొంగిపోతుంది..
మష్కిందపేగు కన్పిస్తలేదు.. యాడ దాసిర్రు.. ఎక్కడ ఆరేసిర్రు..)
సాయమన్ను = స్టోర్ రూమ్ (ఇంటెనకున్న సాయమన్నులో రాగిబిందె సొట్ట్టదీసే పనిముట్లున్నయ్ తీస్కరాపో బిడ్డా.. జల్ది పోయిరావాలె)
మొల్దారం = మొలతాడు, పురుషులు నడుముకు కట్టుకునే ధారం (వీని మొల్దారం దెంచ.. తీస్కున్న డబ్బులు సుతా ఇస్తలేడు. రేపుమాపంటూ చెప్పులరిగేలా తిప్పుతాండు.. వీడి జిమ్మడ)