కొందరికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. విజయవంతంగా పూర్తిచేయలేరు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక.. శత్రువుల ముందు అభాసుపాలు అవుతారు. అలాంటి సందర్భాల్లో ‘నగెవాళ్ల ముందర జారిపడ్డట్టు’ అనే సామెతను ఉపయోగిస్తారు. ‘ఎందుకురా ప్రతిసారీ నగెవాళ్ల ముంగట్నే జారిపడ్తవ్.. మనసుపెట్టి చెయ్ బిడ్డా.. నవ్విన నాపచేనే పండుతది’ అని బుద్ధి చెబుతుంటారు పెద్దలు.
ఈ సామెతలో నగెవాళ్లు అంటే.. నవ్వేవాళ్లు అని అర్థం. మనల్ని నచ్చనివారు, మన అభివృద్ధిని జీర్ణించుకోలేనివారి ఎదుట మన ప్రయత్నాలన్నీ విఫలమతుండటం.. అదంతా చూసి శత్రువులు మన శక్తిని తక్కువ అంచనా వేయడం, హేళన చేయడం.. సాధారణమే. అలాంటి సందర్భాలే ఈ సామెతకు బీజం. నిజంగానే, ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు మనసు చివుక్కుమంటుంది. అయినా.. దూసుకెళ్లి విజయపథంలో నడవటమే విజేత లక్షణం.