మోదీ జీ! నేను, తల్లి భరతమాత 29వ బిడ్డ తెలంగాణను. నీ తల్లి గుజరాత్‌కు చిన్న చెల్లెను. నీకు చిన్నమ్మను. బాగున్నావా కొడుకా? నా అక్క కొడుకు చాయ్‌వాలా ప్రధానయ్యిండని తెలిసి చాలా సంబురపడ్డ బిడ్డ. చిన్ననాటి నుంచి కష్టపడి పని చేస్తూ ప్రధానిదాక పోయినవంటే.. 60 ఏండ్ల దగా పడ్డ నా పిల్లలకు నువ్వు న్యాయం చేస్తవ్ కావచ్చు అనుకున్న. నా పిల్లలు కూడా నిన్ను తారీఫు చేసుకుంటనే వచ్చే, కరోనా వచ్చినప్పుడు నువ్వు దీపం పెట్టుమంటే పెట్టిండ్రు, సప్పట్లు కొట్టమంటే కొట్టిండ్రు, ప్లేట్ల మీద సప్పుడు చేస్తే కరోనా పోతదంటే రోడ్లెక్కి మరీ కొట్టిన్రు కాదు కొడుకా..
నువ్వు కూడా నా ఇంటికి (తెలంగాణకు) వచ్చినప్పుడల్లా కొత్త కొత్త ముచ్చట్లు చెప్తివి. అయ్యో నా పిల్లలకు నువ్ ఎంత సాయం చేస్తవో అ నుకున్నకాదు బిడ్డా. ఏం లాభం కొడు కా.. ఆరుగాలం కష్టపడి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న నా పిల్లల నుంచి వేల కోట్లు ట్యాక్సులు గుంజుకోవడితివిగానీ ఒక్క పెద్ద ప్రాజెక్టునైన ఇయ్యకపోతివి.
అయ్యే.. కష్టమో, నష్టమో నా కొడుకు కేసీఆర్, నా తల్లి నీళ్లు లేక ఇబ్బంది పడుతుందని గోదావరి నది మీద ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కడితే.. ఆ ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదానన్న ఇయ్యకపోతివి, ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకే పెడితివి. అయితమాయేననుకుంటిని.
ఎప్పటి నుంచో ఊరించుకుంట వచ్చి న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇయ్యకపోతివి. కనీసం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న హన్మకొండ-కాజీపేట రైల్వే ఫ్లై ఓ వర్ బ్రిడ్జినన్న కడుతవ్ కావచ్చు అనుకుంటే అదీ కట్టకపోతివి. ములుగు కాడ నా ఆదివాసీ బిడ్డలకు ఇస్తనన్న జాతీయ గిరిజన యూనివర్సిటీ మర్చిపోతివి. మామునూర్లో కడుతనన్న ఎయిర్ పో ర్టు కథ ఎప్పుడడిగినా రేపే అనవడితివి. నా బిడ్డల కోసం నేను 5 ఎయిర్‌పోర్టులను అడిగిన కాదు కొడుకా.. ఒక్కటం టే ఒక్కటికూడా కట్టకపోతివి. మొన్నీ మధ్యల్నే నువ్ హైదరాబాద్‌కు వచ్చి వరంగల్‌లో మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ కడతనంటివి. అది ఇంకా నోచుకోకపోతి మి. మనకన్న పురాత్తిగ అధ్వానమైన బంగ్లాదేశ్ బట్టల తయారీలో మన దేశ మార్కెట్‌ను మించిపోయి మింగేస్తుంటే ఇంకా నీ టెక్స్ టైల్ పార్క్ ఫైళ్లల్లనే ఉండ టం నా దౌర్భాగ్యం అనుకోవాల్నా బిడ్డా మోదీ!
నా కలికితురాయి.. ప్రతిష్ఠాత్మక హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడ్డ రామప్పకు నువ్వు రూపాయి బిల్ల ఇయ్యకపోతివి. కూలగొట్టిన నా వెయ్యిస్తంభాల గుడి కల్యాణ మండపాన్ని ఇప్పటికి పూర్తి చె య్యకపోతివి. ఎన్నోసార్లు అడిగితి కదా బిడ్డా.. నా బిడ్డలకు ఒక ఐఐఎం కావాలని ఇప్పటికీ ఇయ్యకపోతివి. జిల్లాకో నవోదయ పాఠశాలను అడిగితే అదీ నహీ అంటివి. నా బిడ్డలకు నువ్ చేస్తు న్న అన్యాయం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతంది.
నా బిడ్డలకు ఇంటింటికి నీళ్లిచ్చే మిష న్ భగీరథకు ఆర్థిక సహాయం అడిగితి మి, నీ సంస్థ నీతి ఆయోగ్ కూడా ఇయ్యమని చెప్పే. అయినా ఇప్పటికీ నయా పైస ఇయ్యకపోతివి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కడతనంటివి, జహీరాబాద్‌లో నిమ్జ్ కడతనంటివి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను ఏర్పాటు చెయ్యమని అడిగితిమి. నా దగ్గరనే ఉన్న డిఫెన్స్ భూములను మార్చుకుందామంటిమి. నా బిడ్డలు సెక్రెటరేట్ కట్టుకుంటమంటే నీ దగ్గర ఉన్న భూమి ఇయ్యకపోతివి, హైదరాబాద్-నాగపూర్, వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్‌ను అడిగితే ఇప్పటికీ ఊసులేదు. నేను, నా బిడ్డలు అడిగి అడిగి అలిసిపోతిమి బిడ్డ.. ఒక్కటంటే ఒక్క పని చెయ్యకపోతివి. ఇది నీకు న్యాయమా బిడ్డా.
ఇంకో మాట, నా దళిత బిడ్డలు ఎస్సీ వర్గీకరణ కోసం చేసుకున్న విజ్ఞప్తిని ఇం కా పెండింగ్లనే పెడితివి. బీసీల రిజర్వేషన్లను పెంచమంటే ఇప్పటికి సప్పుడు చెయ్యవాయే. నా బిడ్డ పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇయ్యకపోతివి. నా బిడ్డలు పండించిన వరికి, మొక్కజొన్న కు, పత్తికి, ఆలుగడ్డకు గిట్టుబాటు ధరకూడా ఇయ్యకపోతివి. పసుపు బోర్డు తెస్తమని నీ తమ్ముల్లిక్కడ ఓట్లేయించుకొని సర్కసు ఫీట్లు చెయ్యవట్టిరి.
నువ్ తెలంగాణకు ఏం చెయ్యకపోయినా బాగా చేసినట్టు ప్రచారం చేసుకో కు బిడ్డా. నా గుండె కలుక్కుమంటంది. మన్ కీ బాత్‌లో వరంగల్ ఛాయ్ దుకాణం మహ్మద్ పాషాతో మాట్లాడితివి.. ఎన్ని కోట్లు లోన్ ఇచ్చినవో అనుకున్న కొడుకా.. నువ్విచ్చింది రూ.20 వేలు, మాఫీ చేసింది రూ.10 వేలు. కానీ దేశం మొత్తం మా పాషా గురించి చెప్తివి కదా బిడ్డా. మా రాజన్న సిరిసిల్లా చేనేత బిడ్డ వెల్ది హరిప్రసాద్ నీ కోసం జీ-20 లోగోతో కూడిన బ్యానర్ చేయిస్తే, మన్ కీ బాత్ లో ఘనంగా చెప్తివి.. నా సిరిసిల్ల చేనేత బిడ్డలకు ఒక్క రూపాయన్న సాయం చెయ్యకపోతివి. పైగా ట్యాక్సులు కట్టమనవడితివి.
నా బిడ్డలు నియ్యత్ గల్లోల్లు.. కుడుమంటే పండుగ అనేటోల్లు.. నిస్వార్థపరులు. వాళ్లను ఇబ్బంది పెట్టడం మాను కో.. నీ గుజరాతీ తల్లి కోసం నా గొంతు కొయ్యకు బిడ్డా.
నాయనా నీ మాటలు మాణిక్యాలు చేతలు యాలక్కాయలు. ఇకనైన నా మీద నీ విషం చిమ్ముడు ఆపు. నువ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకో.
నాయనా నీకు తెలంగాణకు వచ్చుడే ఇమ్మతి లేదు.. కాకపోతే.. వత్తానవ్.. రెండు గంటలుండి పోతవ్. పోతా పో తా ఇక్కడి నీ తమ్ముళ్లకు చెప్పు బిడ్డా.. జర పేపర్ లీకులు చేసి నా పేదింటి బిడ్డ ల నోట్లో మట్టికొట్టద్దని. లీకులని లొల్లిపెట్టి సదువుకునే నా బిడ్డలకు కొత్త రందివెట్టకని, గీ మాట చెప్పుడైతే మర్చిపోకు బిడ్డా, నీకింత పుణ్యముంటది. నాకు, నా బిడ్డలకు అన్యాయం చేసినా.. నువ్వు వందేండ్లు సల్లగ బతుకు కొడుకా.. ఇదే తెలంగాణ బర్కత్ గల్ల సంస్కృతి.
ఇట్లు : నీ చిన్నమ్మ, తెలంగాణ తల్లి
(ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్ పర్యటన
సందర్భంగా తెలంగాణ బిడ్డల ఆవేదన)