తెలంగాణ అభివృద్ధి దేశానికి దిక్సూచి
పచ్చటి పొలాలు, అలుగు పారుతున్న చెరువులు, ఆనందపడుతున్న రైతులు, శుభ్రంగా ఉన్న పల్లెలు, సంతోషపడుతున్న అక్కడి వృత్తికారులు, అద్భుతమైన ఆదాయం-బహుశా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఇంతటి అభ్యున్నతి చూసి ఉండం. కనీస వసతులైన తాగునీరు, సాగునీరే కాదు, పల్లెల్లోని జనాలకు వైద్య సదుపాయాలు, రేషన్, వైకుంఠధామాలు, కావలసినన్ని ఒక దశాబ్దంలో వెలిశాయి.
నేడు భారతదేశంలో ఒక చిత్రమైన విషయం కనిపిస్తున్నది. గత పదేండ్లుగా కేంద్రంలో పాలించిన భారతీయ జనతా పార్టీ విధానాలతో కొద్దిమంది కోటీశ్వరులు తప్ప, 140 కోట్ల జనాభాకు బతుకు భారంగా మారింది. అయితే 1948 వరకు స్వతంత్ర దేశంగా మనుగడలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ రాష్ట్ర చిత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కేవలం పదేండ్లలో రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
పచ్చటి పొలాలు, అలుగు పారుతున్న చెరువులు, ఆనందపడుతున్న రైతులు, శుభ్రంగా ఉన్న పల్లెలు, సంతోషపడుతున్న అక్కడి వృత్తికారులు, అద్భుతమైన ఆదాయం-బహుశా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఇంతటి అభ్యున్నతి చూసి ఉండం. కనీస వసతులైన తాగునీరు, సాగునీరే కాదు, పల్లెల్లోని జనాలకు వైద్య సదుపాయాలు, రేషన్, వైకుంఠధామాలు, కావలసినన్ని ఒక దశాబ్దంలో వెలిశాయి. ఇదేమీ మాయ, మంత్రంతో రాలేదు. అధినాయకుడి పట్టుదల, మేధస్సు, ప్రణాళికలు, వాటి నిర్వహణ, ఎన్నుకోబడ్డ ప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం-ఇవన్నీ కలిసి సాధ్యమైంది. మరి ఒక చిన్న రాష్ట్రం చేయగలిగిన పనిలో ఒక్కటైనా దేశాన్ని పాలించే నాయకులు ఎందుకు చేయలేకపోయారు? రైతులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, దారిద్య్రరేఖ దిగువన ఉన్న సామాన్యులు, అసంఘటిత కార్మికులు, పరిశ్రమలు, తాగునీరు, సాగునీరు, వృత్తి వ్యాపారులు, పట్టణాల అభివృద్ధి నగరాల సుందరీకరణ-బీజేపీ ప్రభుత్వం ఈ రంగాల్లో ఏమి చేసిందో చెప్పగలరా? వారి ప్రభుత్వాలు అధికారం ఉన్న రాష్ర్టాలైనా ఏ రంగంలోనైనా తెలంగాణతో పోటీ పడగలవా? పడలేవు. ఎందుకంటే వారి పార్టీ రహస్య అజెండా ఎన్నికలలో చెప్పినది కాకుండా, వేరే ఉంది. ఇప్పటిదాకా అమలైన కేసీఆర్, నరేంద్ర మోదీ, పథకాలు, ప్రణాళికలు చూస్తే వ్యత్యాసం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినవి భారతదేశంలో ఎందుకు సాధ్యం కాలేదో తెలుస్తుంది.
ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, బీజేపీ కంటే ఏ విధంగా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందో, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుందో తెలుస్తుంది. మరి బీజేపీ ఎన్నికల్లో ఏం చెప్పిందో, చెప్తుందో, గెలిచాక ఏం చేస్తుందో తెలుస్తుంది. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ర్టాలలో ప్రభుత్వం ఏర్పాటుచేసినా దాని సిద్ధాంతాలు ఒకటే కాబట్టి ఈ కింద చెప్పినవి ఆ రాష్ర్టాలలో కూడా జరుగుతాయి. అదే తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతా జరిగితే? ఆలోచించండి. అది జరగాలంటే ముందు బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికలలో గెలవాలి కదా! ఇక చదవండి పక్కన ఇచ్చిన 22 తేడాలు.
కేసీఆర్ పథకాలు, ప్రణాళికలు
- ప్రకటించిన ఎన్నికల పథకాలు అమలుచేయటం. జనహిత పథకాలు ప్రకటించనవి కూడా చేయటం.
- రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు.
- ఉచిత కరెంటు, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, పంట మొత్తం కొనుగోలు. రైతుల కుటుంబాల కోసం రైతుబీమా.
- గర్భిణులకు పోషకాహార, ప్రసూతి వసతులు, కేసీఆర్ కిట్, ప్రయాణ సౌకర్యాలు.
- మైనారిటీలకు గురుకులాలు, ప్రత్యేక పథకాలు-గంగాజమునా తహజీబ్.
- స్వాతిలక్రా ఆధ్వర్యంలో షీ టీమ్స్.
- దేవాలయాల ఉద్ధరణ, అర్చకులకు, ఇమామ్లకు, పాస్టర్లకు ధన సహాయం.
- మరణించిన రైతు నిరశనకారులకు, సైనికులకు ధన సహాయం, నివాళి.
- పత్రికా ప్రతినిధులకు ఇండ్ల స్థలాలు, మరణించినవారి కుటుంబాలకు ధన సహాయం.
- వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు పింఛన్.
- బీదవారికి వివిధ పథకాలు-రేషన్లో సన్నబియ్యం, ధన సహాయం, ఉచిత వైద్యం, ప్రభుత్వ దవాఖానల స్థాపన, బలోపేతం, ముఖ్యమంత్రి నిధి నుంచి ధన సహాయం.
- అన్ని గ్రామాలలో సిమెంటు రోడ్లు, పల్లెలలో శుభ్రత, రాష్ట్రంలో హరితహారం, అడవుల పెంపు, సంరక్షణ.
- ట్రాఫిక్ నియంత్రణ, వర్షకాల వరదనీటి నియంత్రణ, బైపాస్ అండర్పాస్ బ్రిడ్జిలు, పార్కుల సుందరీకరణ.
- రైతు రుణమాఫీ 73 కోట్ల వరకు.
- రుణాలు తీసుకొని సంపద పెంపు దీర్ఘకాలిక లక్ష్యాల సాధింపు. రాష్ట్ర సంపద పెంచి, సంక్షేమ పథకాలు జరపటం, తలసరి ఆదాయం పెంపు.
- వైద్య విద్య, పాఠశాలలు, కళాశాలలు, దవాఖానలు, జెన్కో వంటివి ప్రభుత్వ ఆధీనం, సంరక్షణ పథకాలు.
- లౌకిక పాలన, అన్నిమతాల, కులాల, వర్గాల, జాతులకు సమాన గౌరవం, సంక్షేమం, అందరి మధ్య సహృదయత, స్నేహాల పెంపు, సుహృద్భావ వాతావరణం స్థాపించటానికి కృషి.
- ప్రభుత్వ పాఠశాలల స్థాపన, ఉచిత విద్యాబోధన, పుస్తకాల పంపిణీ, పోషకాలతో అల్పాహారం, భోజనం, పారదర్శక విద్యావిధానం, పటిష్ఠత పెంపు.
- పరిశ్రమల స్థాపన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి, ఉద్యోగాలు లక్షలలో.
- ఎన్నికలలో ప్రజలు గెలిచి బాగుపడాలనే నినాదం.
- అవినీతి తగ్గింపు.
- ప్రజాహితంగా పరిపాలన, వసతుల నిర్మాణం, రాష్ట్ర సంపద పెంపు.
నరేంద్ర మోదీ పథకాలు, ప్రణాళికలు
- గెలిచిన తర్వాత ప్రకటిత పథకాలు పక్కకు, అప్రకటిత పథకాలు అమలు.
- అదానీ బంధు, అంబానీ బంధు.
- రైతు కార్పొరేట్ చట్టాలు, నిరసన కార్యక్రమాలపై నిరంకుశత్వం, అణచివేత. వారు చనిపోయినా నిర్లక్ష్యం.
- గర్భిణీలపై కూడా అత్యాచారాలు సాగించడం.
- మైనారిటీలకు బుల్డోజర్ పథకాలు, అక్రమ నిర్బంధాలు, ఎన్కౌంటర్లు.
- బ్రిజ్భూషణ్ ఆధ్వర్యంలో హీ టీమ్స్.
- మసీదుల తవ్వకం, ఇతర మతాల మీద విద్వేషం రగలించటం.
- వీరోచితంగా మరణించిన సైనికులకు సంతాప సందేశం కూడా పంపకపోవటం.
- విమర్శించిన పత్రికా ప్రతినిధులకు జైలుశిక్ష, ప్రజలకు స్వతంత్రం కావాలన్న వారికి నిర్బంధం, శిక్ష.
- వృద్ధులకు ఉన్న వసతులు, రాయితీలు తొలగింపు. పింఛనర్ల నిధిలోంచి కోట్లు మాయం.
- బీదవారి వసతులైన గ్యాస్ సిలిండరు ధర పెంపు, ఇతర వస్తువుల ధరలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెంపు. జీఎస్టీ విధింపు, ప్రధానమంత్రి నిధి నుంచి వేల కోట్లు మాయం.
- గ్రామాల నిర్లక్ష్యం, అడవులు కార్పొరేట్లకు కైంకర్యం.
- వరదలలో నష్టం పట్ల నిరాసక్తత, నగరాల ట్రాఫిక్, కాలుష్యం పట్ల నిర్లక్ష్యం. పోర్టులు, విమానాశ్రయాలు కార్పొరేట్లకు కట్టబెట్టడం.
- కార్పొరేట్ల బ్యాంకు రుణమాఫీ 12 లక్షల కోట్ల వరకు.
- 100 లక్షల కోట్ల రుణం దేశానికి పెంపు. కార్పొరేట్లకు మదుపు, బీదవారి సంక్షేమం కుదింపు. దేశంలో తలసరి ఆదాయం బీద దేశాల కంటే తక్కువ.
- బ్యాంకులు బీమాలతో సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్ సంరక్షణ పథకాలు.
- లౌకిక వ్యతిరేక విధానాలు, ఇతర మతాల, కులాల, వర్గాల, జాతుల, రాజకీయవర్గాల వారి పట్ల విద్వేషం, మత మౌఢ్యం పెంపు. ప్రజలను విడదీసి పాలించే బ్రిటిష్ సిద్ధాంత ఆచరణ. రాజకీయ లబ్ధికి ద్వేషపూరిత వాతావరణ సృష్టి, అలజడి, అల్లర్లు, హింస.
- జాతీయ విద్యావిధానంలో లౌకిక, ఆధునిక, శాస్త్రీయ భావాల తొలగింపు, గందరగోళ పాఠ్యాంశాలు, విద్వేషపూరిత సిద్ధాంతాలు.
- నోట్ల రద్దు వంటి పథకాలతో, ప్రైవేటీకరణతో ఉద్యోగాల నష్టం, ఉపాధి కోల్పోవడం.
- ఎన్నికలలో కేవలం తమ పార్టీ గెలవాలని వీలైనన్ని కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు.
- బినామీలతో అవినీతి సంపాదన.
- కార్పొరేటర్లకు సహాయంగా పాలసీల మార్పు, పరిపాలన, దేశ సంపద దోపిడీ.
దంటు కనకదుర్గ
89772 43484
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

